English | Telugu

యూత్ కి నయని పావని నయనానందం!

బిగ్ బాస్ ఇప్పటికి మంచి క్రేజ్ తో ముందుకు సాగుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. హౌస్ లోకి మొదట మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ రాగా.. 2.0 లో అయిదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అంబటి అర్జున్, అశ్వినిశ్రీ, నయని పావని, భోలే షావలి, పూజా మూర్తి వచ్చారు.

బిగ్ బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్ అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.

ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వచ్చిందట. ఇక ఎంట్రీ లోనే అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ లోని మొదటి వారానికే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది నయని. తన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని నెటిజన్లు అప్పట్లో ఫుల్ ట్రోల్ చేశారు. ఇక హౌస్ నుండి బయటకొస్తుంటే హౌస్ లోని వారంతా ఎమోషనల్ అయ్యారు. శివాజీని డాడీ అంటూ ఎంతో ప్రేమగా ఉన్న నయని.. నాకు హౌస్ లోకి వెళ్ళాక నాన్న దొరికాడని అంది. ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ట్యాలెంట్ చూపిస్తుంది నయని. బ్లూ కలర్ డ్రెస్ లో అందాలని చూపిస్తూ, హావభావాలని వ్యక్తం చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేసేలా తమ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. తను చేసిన ఈ ఫోటోలు కొన్ని మరీ బోల్డ్ గా ఉండటంతో నయని నెట్టింట వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.