English | Telugu

అనామికని గుర్తుపట్టని కళ్యాణ్.. అపర్ణ నిర్ణయాన్ని దుగ్గిరాల ఫ్యామిలీ నిలబెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -184 లో.. అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. మీరు నా అడ్రెస్ కనుక్కోవడానికి ట్రై చెయ్యొద్దు. నేను చెప్పిన దగ్గరికి రండి. మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని అనామిక అనగానే.. కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయి సరే అంటాడు.

మరొకవైపు కావ్య వాళ్ళు అత్తింటికి వస్తుంటే కొందరు రౌడీలు కావ్యని ఏడిపిస్తారు. అప్పుడే అటుగా రాజ్ కార్ వెళ్తుంది రౌడీలను చూసిన రాజ్ కార్ ఆపి.. రౌడీలకి బుద్ది చెప్తాడు. మేడమ్ మీ భార్య నా సర్ అని రౌడీ లు అక్కడ నుండి పారిపోతారు. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు కార్ లో ఇంటికి బయలుదేర్తారు. మరొక వైఫు అనామికని కలవడానికి అప్పుని కళ్యాణ్ తీసుకొని బయలుదేర్తాడు. అప్పుడే వాళ్ళు వెళ్తున్న బైక్ ఆగిపోతుంది. అప్పుకి మాత్రం చిరాకుగా ఉంటుంది. మరొకవైపు మీరు నన్ను భార్యగా ఒప్పుకోలేదని అన్నారు. మరి ఆ రౌడీలని ఎందుకు కొట్టారని కావ్య ప్రశ్నలు వేస్తుంటే రాజ్ వాటికి సమాధానం చెప్పకుండా తను చేసే పని చేసుకుంటాడు. మరొక వైపు బైక్ ని తోసుకుంటూ అప్పు, కళ్యాణ్ అనామికని కలవడానికి వెళ్తారు. మధ్యలో కళ్యాణ్ అనామిక వెళ్లే కార్ ని లిఫ్ట్ అడుగుతాడు. అది అనామిక అని కళ్యాణ్ కి తెలియదు. అప్పుని వదిలేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనామిక మాటల్లో తనే అనామిక అని గుర్తుపట్టలేదు కళ్యాణ్. మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు ఇంటికి వస్తారు. కావ్య బ్యాగ్ కార్ లోనే మర్చిపోతుంది. బ్యాగ్ పట్టుకొని రాజ్ కావ్య వెనకాల రావడం చూసిన అపర్ణ.. రాజ్ వంక కోపంగా చూస్తుంది. చూసావా నీ కొడుకు ఎలా కావ్య వెనకాల వస్తున్నాడో మమ్మల్ని మాట్లాడద్దని అన్నావ్? నువ్వు నీ కొడుకు మాట్లాడకుండా చూసుకోమని అపర్ణతో రుద్రాణి చెప్తుంది. అలా చెప్పగానే అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరొక వైపు అనామిక తన ఫ్రెండ్ ని కళ్యాణ్ ముందుకు పంపిస్తుంది. తనే అనామిక అని యాక్ట్ చేపిస్తుంది. అనామిక ఫ్రెండ్ ని చూసిన కళ్యాణ్ షాక్ అవుతాడు. మీకు పెళ్లి అయిందా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అవును ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని తను చెప్పగానే కళ్యాణ్ మరింత షాక్ అవుతాడు.. అదంతా దూరం నుండి చూస్తున్న అనామిక నవ్వుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ కి అనామిక ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తుంది. అది తీసుకొని కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. అపర్ణ ఇంట్లో ఎవరిని కావ్యతో మాట్లాడొద్దని చెప్పిన మాటలు ఇందిరాదేవి గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.