English | Telugu

Guppedantha Manasu : కన్నతండ్రి ఎవరో తెలుసుకోవాలని కొడుకు ఆవేదన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1085 లో... శైలేంద్ర అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంటాడు. అప్పుడే వసుధార వచ్చి ఎందుకు ఆ శైలేంద్ర అన్న మాటలు పట్టించుకుంటున్నారు. మనం మోసం చేశామని కావాలనే ఇలా చేస్తున్నాడని వసుధార అంటుంది. నా తండ్రి గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నానని మను అంటాడు.

మీరు దత్తత ముందు రోజు ఫోన్ చేసి దత్తత కి రండి.. ఆ తర్వాత మీ నాన్న గురించి తెలిసే అవకాశం ఉందని అన్నారు అందుకనే నేను ఆ రోజు దత్తత కార్యక్రమం రోజు వచ్చాను కానీ అలా జరిగిందని మను అంటాడు. మీకు నా కన్నతండ్రి గురించి తెలుసా అని వసుధారని మను అడగ్గానే.. తను కంగారుగా వెళ్ళిపోతుంది. దాంతో మనుకి డౌట్ వస్తుంది. వసుధారకి నా తండ్రి ఎవరో తెలుసని మను అనుకుంటాడు. ఆ తర్వాత మను ఆలోచిస్తుంటే.. పెద్దావిడ జ్యూస్ తీసుకొని వస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ మను ఎమోషనల్ అవుతాడు. నా తండ్రి గురించి నాకు తప్ప అందరికి తెలుస్తుందని మను అనగానే.. ఇంకెవరికి తెలిసిందని పెద్దావిడ అడుగుతుంది. వసుధర గారికి తెలుసని అనగానే.. తనకి తెలుసని నీకెలా తెలుసని పెద్దావిడ అడుగుతుంది. తన మాటల్లో అర్థమైంది‌. నా తండ్రి గురించి తెలుసా అని అడిగితే మౌనంగా వెళ్లి పోయిందని మను చెప్తాడు. అలా వెళ్ళిపోతే తెలుసని అనుకోవడమేనా అని పెద్దావిడ అంటుంది.

మహేంద్ర నిన్ను కన్నకొడుకు లాగా చూస్తున్నాడు కదా ఇంకేంటని పెద్దావిడ అంటుంది. మహేంద్ర గారి పేరు తీసుకొచ్చి మంచి ఐడియా ఇచ్చావని మను అనుకుంటాడు. మరొకవైపు అనుపమ, మహేంద్ర వసుధారలు మను గురించి మాట్లాడుకుంటారు. మనుకి అవమానం జరుగుతుందని దత్తత తీసుకొవాలనుకున్నా కానీ ఇంకా తనకి అవమానం జరుగుతుందని మహేంద్ర అంటాడు. కన్నతండ్రి పక్కనే ఉన్నా తెలుసుకొవడం లేదని వసుధార అనగానే.. మహేంద్ర షాకింగ్ గా ఏంటని అడుగుతాడు‌. వెంటనే వసుధార ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత మను వచ్చి నన్ను కన్న కొడుకులాగా చూసుకున్నారు. ఇప్పుడు మీరే నా కన్నతండ్రి ఎవరో కనుక్కోవాలని మను అంటాడు. సరేనని మహేంద్ర అంటాడు. మాట ఇవ్వండని మహేంద్ర దగ్గర మను మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.