English | Telugu
ఇంద్రజను నాయనమ్మను చేసేసిన నూకరాజు
Updated : May 27, 2024
నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం సందడి సందడిగా ఉండబోతోంది. ఎందుకంటే జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ స్పెషల్ ఈవెంట్ తో ఈ షో మన ముందుకు రాబోతోంది. తెలంగాణ కోసం జరిగిన మారణకాండకు సంబంధించిన ఎన్నో దృశ్యాలను ఈ షోలో చూపించారు. ఇక ఇంద్రజ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. అలాగే కమెడియన్స్ తో కలిసి డాన్స్ చేసింది. నూకరాజు పాడిన ఒక ఎమోషనల్ సాంగ్ కి ఆమె చాలా బాధడింది. ఇక ప్రోమో స్టార్టింగ్ లో ఆటో రాంప్రసాద్ వచ్చి నాటి నరేష్ తో ఇలా అన్నాడు "మన ఊరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా గెలుద్దామనుకుంటున్నా" అన్నాడు. దాంతో నరేష్ తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తర్వాత అక్కడికి ఫైమా వచ్చేసరికి పోటీల్లో ఓటెయ్యి అని అడిగాడు. దానికి తాను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పేసరికి ఆటో రాంప్రసాద్ షాక్ అయ్యాడు. "నా గుర్తు పిడక..నేనేం చేసినా దొరకా" అని ఫైమా ఎన్నికల్లో తన గుర్తు గురించి చెప్పేసరికి అందరూ నవ్వేశారు.
మొత్తం అందరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు..ఎం చేయాలో అర్ధం కావడం కావట్లేదంటూ రాంప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ షోకి "హరోంహర" మూవీ నుంచి సుధీర్ బాబు వచ్చాడు. తర్వాత పండు - శిరీష కలిసి అలనాటి ఆ పాత మధురాలకు కొత్త స్టెప్స్ ని మిక్స్ చేసి డాన్స్ చేసి అలరించారు. నూకరాజు ఐతే ఇంద్రజను నయనమ్మతో పోల్చేసాడు. "కోటబొమ్మాళి" మూవీలో "ఓయమ్మా" సాంగ్ ని పేరడీ కట్టాడు. "ఓ యమ్మ ఇంద్రజమ్మ నా పిల్లలకు నువ్వు నాయనమ్మ" అనేసరికి ఇంద్రజ తెగ ముసిముసి నవ్వులు నవ్వేసుకుంది. తర్వాత ఫైమా మీద బాడీ షేమింగ్ చేస్తూ ఒక పేరడీ సాంగ్ కూడా పాడాడు. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నూకరాజు ఒక మెన్ షోగా నడిపించబోతున్నాడని ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.