English | Telugu
నేనే ఆ హీరోని.. కార్లు, ఫ్లాట్లు, విల్లాలు నేనే కొనుక్కుంటున్నాను!
Updated : Nov 21, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ' వల్లఒక్కొక్కళ్ళ గుట్టు థంబ్ నెయిల్స్ ద్వారా బయటపడ్డాయి."రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంట? ఎవరా హీరో?" అనే థంబ్ నెయిల్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.. ఇక అది చూసి ఇంద్రజ కూడా "రష్మీ! ఎవరా హీరో?" అని అడిగింది. "థంబ్ నెయిల్ కింద ఉన్న ఫోటో చూస్తే సునిసిత్ లా ఉన్నాడు" అని ఆది కామెడీ చేసాడు.
ఇక రష్మీ మాట్లాడుతూ, "మా సొంత డబ్బులతో ఫ్లాట్ లు, విల్లాలు కొనుక్కుంటే ఎవరో ఇచ్చారనే ఫిక్స్ ఐపోతారా ఏమిటి ? ఎవరా హీరో అని అడిగారు కాదా... నేనే ఆ హీరోని.. ఎందుకంటే నేను సంపాదించిన డబ్బులతో కార్లు, ఫ్లాట్ లు, విల్లాలు నేనే కొనుక్కుంటున్నాను.. ఇలాంటి థంబ్ నెయిల్స్ ని నమ్మకండి.. మేం డే అండ్ నైట్ షూట్ చేస్తాం, చెక్ తీసుకుంటాం" అని రష్మీ చాలా సీరియస్ గా యూట్యూబర్స్ కి వార్నింగ్ ఇచ్చేసరికి ఆది ఎంట్రీ ఇచ్చి "రష్మీ హీరోయిన్ కాదు హీరో..అని మరో థంబ్ నైల్ రాస్తారు, సైలెంట్ గా ఉండు"అనేసరికి అందరూ నవ్వేశారు.
తర్వాత "ఎవరికీ డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్ లో పరదేశి అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు" ..అనే ఫన్నీ థంబ్ నెయిల్ గురించి అతను మొదట కాస్త సీరియస్ ఐనట్టు నటించి తర్వాత కామెడీగా ఆన్సర్ చేసాడు. "ఎవరి మీదనైనా ఒక రూమర్ వస్తే దానికి ఇంకొన్ని కలిపి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వైరల్ చేస్తూ ఉంటారు. ఈ థంబ్ నెయిల్ నిజం కాదు. ఎందుకంటే లేడీస్ హాస్టల్ లో జెంట్స్ ని ఉండనివ్వరు" అని చెప్పి అందరినీ నవ్వించేసాడు పరదేశి.