English | Telugu

మెరీనా ఎలిమినేషన్ వెనుక కారణం ఏంటి?

బిగ్ బాస్ హౌస్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఆదివారం సండే ఫండే అంటూ సాగిన ఎపిసోడ్‌లో నాగార్జున, కంటెస్టెంట్స్ తో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తూ, నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు.

అయితే ఇలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరగా ఇనయా, మెరీనా మిగిలారు. ఆ తర్వాత 'ఒక మిషన్ లో ఇద్దరి ఫోటోలో వేస్తాను. అందులో నుండి ఎవరి ఫోటో చెరిగిపోతుందో వారు బయటకు వస్తారు' అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత మెరీనా ఎలిమినేటెడ్ అని చెప్పాడు. మెరీనా హౌస్ నుండి బయటకు వస్తుంటే రోహిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి వచ్చేసింది.

డేంజర్ జోన్ లో మెరీనా-రోహిత్ తో పాటుగా శ్రీసత్య ఉండగా మెరీనాని ఎలిమినేట్ చేయడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్, ఇప్పుడు ఓటింగ్ లో మెరీనా కంటే శ్రీసత్య తక్కువగా ఉన్నా మెరీనానే ఎలిమినేట్ చేయడం వెనుక చాలా కథే ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత వారం 'ఫ్యామిలీ మీట్' ఉండటమే కారణం అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం శ్రీసత్య వల్ల కంటెంట్ వస్తుందని అంటున్నారు.

అయితే ఈ వారం మెరీనాని ఎలిమినేట్ చేస్తే తర్వాత వారం మళ్ళీ ఫ్యామిలీ మీట్ లో తిరిగి హౌస్ లోకి తీసుకొస్తే, అప్పుడు ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడమే కాకుండా, TRP కూడా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.