English | Telugu
Divya Remuneration: దివ్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Nov 30, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో మొదటగా ఒక కామనర్ గా అగ్నిపరీక్షలో ఎంట్రీ ఇచ్చింది దివ్య. అయితే తనయ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఇక బిగ్ బాస్ తనని మూడో వారం అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ తో లోపలికి తీసుకొచ్చాడు. అయితే తనని హౌస్ మేట్స్ అంతా వద్దని ఓట్ చేశారు కానీ బిగ్ బాస్ తననే హౌస్ లోకి తీసుకొచ్చాడు.
మూడో వారం నుండి పన్నెండో వారం వరకు దివ్య స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ దృష్టిలో నిలిచింది. అయితే భరణితో అన్నయ్య అనే బాండింగ్ ని కొనసాగించడమే తన గేమ్ ని స్పాయిల్ చేసింది. భరణి మధ్యలో ఎలిమినేట్ అయి లోపలికి వెళ్ళాడు. అప్పుడు దివ్య మళ్లీ తనతో బాండింగ్ కొనసాగించడం తనని వెనక్కి లాగేసింది. గతవారం ఇమ్మాన్యుయల్ పవరస్త్ర వాడటం వల్లే దివ్య హౌస్ లో ఉంది. అయితే ఈ వారం మాత్రం తను ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది.
దివ్య వారానికి లక్ష యాభై వేల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే తను హౌస్ లో ఉన్న తొమ్మిది వారాలకు గాను పదమూడు లక్షల యాభై వేల నుండి పద్నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ దివ్య అందుకున్నట్లు తెలుస్తోంది.