English | Telugu

Madhuri Elimination : మాధురి ఎలిమినేషన్.. తనూజ వెన్నుపోటు!

బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో కంటెస్టెంట్ ఆటతీరు ఒక్కోలా ఉంటుంది. అప్పటిదాకా కలిసి ఉన్న ఇద్దరు ఆ తర్వాత గొడవ పడుతున్నారు. లేదా స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఎందుకంటే మాధురి, తనూజ క్లోజ్ అయ్యారు. కానీ మాధురి ఎలిమినేషన్ రౌండ్ లో ఉండగా తనని సేవ్ చేసే అవకాశం వచ్చినా తనూజ సేవ్ చేయలేదు. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం.

సండే ఫన్ డే గేమ్స్ తో పాటుగా ఒక్కో సేవింగ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ‌ఇక చివరగా గౌరవ్, మాధురి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు‌. ఇక మాధురి ఎలిమినేషన్ అయినట్లు హౌస్ లోని డిస్ ప్లే లో కంటెస్టెంట్స్ కి చూపించాడు నాగార్జున. ఇక తనూజ దగ్గరున్న గోల్డెన్ పవర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేస్తావా అని నాగార్జున అడిగాడు. అయితే తనూజ తన సేవింగ్ పవర్ ని వాడలేదు. దాంతో మాధురి ఎలిమినేట్ అయి గౌరవ్ ఒక్కడే హౌస్ లోకి వచ్చాడు. అతడిని చూసి రాము రాథోడ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మాధురి బయటకు వచ్చిందని తనూజ ఎమోషనల్ అయింది.

మాధురి స్టేజ్ మీదకి రాగానే ఎక్స్‌పెక్ట్ చేశారా.. అని నాగార్జున అడిగారు. చేశా సర్ నిజానికి ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నా.. ఎల్లుండి నవంబర్ 4 మా ఆయన బర్త్‌ డే సర్.. అని మాధురి చెప్పింది. ఓహో అంటూ నాగార్జున నవ్వారు. కానీ హౌస్ చాలా బావుంది.. హౌస్ నాకు చాలా నేర్పించింది.. చాలా నేర్చుకున్నానని మాధురి చెప్పింది. సరే మీ జర్నీ చూద్దామంటూ ఏవీ ప్లే చేశారు. ఏవీ చివరిలో చూస్తూ మాధురి ఎమోషనల్ అయింది. లైఫ్ లాంగ్ మెమోరీ సర్ అంటు మాధురి చెప్పింది. ఇక స్క్రీన్ మీద హౌస్‌మేట్స్‌ని చూపించగానే ఏమ్మా తనూజ అంత ఫీలవుతున్నావని నాగార్జున అడిగారు. అనుకోకుండా క్లోజ్ అయిపోయింది సర్.‌ తను రాక్షసి కానీ చాలా మంచిది సర్.. అని తనూజ చెప్పింది. ఇక హౌస్ లో రోజ్ ఎవరు ముళ్ళు ఎవరో చెప్పమంటూ నాగార్జున అడుగగా.. మొదటిది తనూజకి ఇచ్చింది మాధురి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ ల కి రోజ్ ఇచ్చింది మాధురి. ఇక ముళ్ళు ఎవరికి ఇస్తావని నాగార్జున అడుగగా.. భరణికి మొదటి ముళ్ళు గిఫ్ట్ గా ఇచ్చింది. తను ఫేక్ గా ఉంటున్నాడని, అందరు వెన్నుపోటు పొడిస్తే ఈయన డైరెక్ట్ గానే పొడుస్తాడని మాధురి అంది. ఆ తర్వాత దివ్యకి ముళ్ళు ఇచ్చింది. తన గేమ్‌ కంటే కూడా పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ కాన్సట్రేషన్ పెడుతుంది.. పక్కవాళ్ల గేమ్ ఎక్కువ ఆడటానికి ట్రై చేస్తుంటుంది.. వాళ్ల వాయిస్ కూడా ఆమే అయిపోతుంది.. అవన్నీ తగ్గించుకొని ఆడితే బావుంటుంది సర్ అని మాధురి చెప్పింది. ఇక ఆ తర్వాత మాధురికి బై చెప్పేసి పంపించేశాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.