English | Telugu

సేవ్ ది టైగర్స్ లో తనకి డబ్బింగ్ చెప్పింది ఆర్జే కాజల్!

ఓటీటీ వేదికపై ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సినిమాలు, సిరీస్ లు చాలా తక్కువగా వస్తుంటాయి. అందులోను ఈ సంవత్సరం రిలీజ్ అయిన వాటిల్లో మరీ తక్కువగా ఉన్నాయి. హనుమాన్ , సేవ్ ది టైగర్స్, ప్రేమలు లాంటివి మాత్రమే అడల్ట్ కంటెంట్ లేకుండా ఉన్నాయి.

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, వేణు వెల్దండి తదితరులు నటించిన సేవ్ ది టైగర్స్ సీజన్ - 2 కి ప్రస్తుతం అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది‌‌.‌ ఇందులో అభినవ్ గోమటం, రోహిణిల కామెడీ అందరిని ఎక్కువగా ఆకట్టుకుంది. అయితే అభినవ్ గోమటంకి భార్య పాత్రలో చేసిన పావని గంగిరెడ్డి అభినయాన్ని ప్రదర్శించింది‌. అయితే ఈమెకి డబ్బింగ్ చెప్పింది ఆర్జే కాజల్. ఆర్జే కాజల్ ప్రస్తుతం చాలా సీరియల్స్ లోని హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్తోంది. తజ బిజీ షెడ్యూల్ లో సేవ్ ది టైగర్స్ డబ్బింగ్ స్టూడియోకి వచ్చి మరీ పావని గంగిరెడ్డికి డబ్బింగ్ చెప్పిందంట. డబ్బింగ్ అయ్యాక సిరీస్ రిలీజ్ అయ్యాక చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట కాజల్. ఇక దానికి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు.

ఆర్జే కాజల్ ఎఫ్ఎమ్ స్టేషన్ లో పనిచేస్తోంది‌. దానితో పాటు, కాజల్ తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. కాజల్ తన డబ్బింగ్ స్వర్ణంతో 2009 లో తెలుగు సినిమా 'నిన్ను కలిషాక'తో ప్రారంభమైంది. కాజల్ అనేక ముఖ్యమైన సినిమాలలో హీరోయిన్స్ కు అలాగే ఇంపార్టెంట్ ఫీమేల్ పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పింది. తరచుగా సోషల్ మీడియాలో తన లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. కొంతమంది సెలబ్రెటీలను కూడా తరచుగా ఇంటర్వ్యూలు చేస్తు ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.