English | Telugu

Brahmamudi:నువ్వు నా మిస్సెస్ గా అన్ పర్ ఫెక్ట్.. కావ్య అప్పలమ్మ అంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో.. నన్ను మీరు ఏ రోజు భార్యగా చుడలేదు. ఎందుకని మీకు నేనేం తక్కువ చేసానని కావ్య ఏడుస్తూ రాజ్ ని నిలదీస్తుంది. నిన్ను భార్యగా ఒప్పుకోకపోవడానికి చాలా కారణాలున్నాయని రాజ్ అంటాడు. వాటిని రాసి చూపిస్తాను చూడంటూ బోర్డు దగ్గరికి వెళ్తాడు. రాజ్ కి కావ్య గురించి ఏం రాయాలో అర్థం కాదు.

ఆ తర్వాత వంద కారణాలు అన్నారు. ఏంటి ఒక్కటి కూడా రాయడం లేదని కావ్య అనగానే.. ఇదిగో ఇదే అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటావని ఒకటి రాస్తాడు. నీ మాటే నెగ్గాలని ఇంకొకటి రాస్తాడు. ఇక రాజ్ కీ ఏం రాయాలో తెలియక.. ఇలా అప్పలమ్మలా రెడీ అవుతావు.. అలా రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నా భార్య అంటే ఎలా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిన ఇలా వెళ్ళాగలనా.. భార్యంటే భర్త స్టేటస్ పెంచేలా ఉండాలి. నువ్వు నా భార్యగా అన్ ఫిట్ అని కావ్యని రాజ్ చులకన చేసి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ లో వర్క్ చేస్తుందా అని సుభాష్ ని అపర్ణ అడుగుతుంది. తనకేంటి అలాంటి డిజైనర్ ఎక్కడ ఉండదంటూ సుభాష్, ప్రకాష్ ఇద్దరు పొగుడుతుంటే.. ధాన్యలక్ష్మి అది వినలేక వెళ్ళిపోబోతుంటుంది. తను అలా వెళ్ళడం చూసిన ప్రకాష్.. ఎందుకు వెళ్తున్నావని అడిగుతాడు. అలా అడగడంతో ప్రకాష్ ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. దాంతో అందరి ముందు నీ భర్తతో అలాగేనే ప్రవర్తించేదంటు ధాన్యలక్ష్మిని ఇందిరాదేవి తిడుతుంది. ఆ తర్వాత అక్కడికి కళ్యాణ్ వచ్చి.. తన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అన్నట్లు మాట్లాడేసరికి అపర్ణ.. పంతులికి ఫోన్ చేసి శోభనం ముహూర్తం చూడమని చెప్పిందని ఇందిరాదేవి అనగానే.. కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కొడుకు గురించి ఎవరు పట్టించుకోనవసరం లేదంటూ ధాన్యలక్ష్మి అంటుంది. మంచిది నా కొడుకు కోడలు గురించి పట్టించుకుంటానంటు.. కావ్యకి నగలు చేయించాలి.. డిజైన్స్ కావ్యని వెయ్యమని చెప్పండని సుభాష్ కి అపర్ణ చెప్తుంది. నా కోడలికి కూడా చేయించాలని ప్రకాష్ కి ధాన్యలక్ష్మి చెప్తుంది.

ఆ తర్వాత అప్పు డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడని, తన కూతురిని కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తుంటే.. ఏమైందని ఆవిడని అడిగి తెలుసుకుంటుంది. మరొకవైపు కావ్య నోటికి ప్లాస్టర్ వేసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. రాత్రి ఎక్కువ వాగుతుందని బోర్డు పై రాజ్ రాసాడు కాబట్టి తనకి మంచి భార్య అనిపించుకోవాలని ఉంటుంది. తను రాసినవి చేస్తానని చెప్తుంది.. ఆ తర్వాత అనామికకి వాళ్ళ అమ్మ శోభనం చెడగొట్టుకునే ప్లాన్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకోవాలని అప్పు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి వెతకమని చెప్తుంది. తరువాయి భాగంలో నా చెల్లిని ఎవరో అప్పలమ్మ అన్నారంట అని కావ్యని స్వప్న బాగా రెడీ చేసి ఆఫీస్ కి పంపిస్తుంది. కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.