English | Telugu
బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హోస్ట్ శ్రీముఖి..ఆగష్టు 17 నుంచి ప్రసారం..
Updated : Jul 28, 2025
బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ చాలా వస్తున్నాయి. కామన్ మ్యాన్ ఎవరు వెళ్తారు ఎంతమంది వెళ్ళబోతున్నారు. అలాగే కంటెస్టెంట్స్ ఎవరు అనే టాక్ కూడా బాగా నడుస్తోంది. ఐతే కామన్ మ్యాన్ కోసం ఎంట్రీస్ ని పిలిచింది బిగ్ బాస్ టీమ్. ఇక ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరిలో ఎవరు వెళ్తారు అనే ప్రాసెస్ నడుస్తోంది. ఐతే ఇప్పుడు ఇంకో లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం శ్రీముఖి హోస్ట్ గా రాబోతోందట. ఇక నటుడు శివాజీ, విజె సన్నీ, అభిజీత్ జడ్జెస్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ అగ్నిపరీక్ష అనేది ఆగష్టు 17 నుంచి ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ కాబోతోంది. ఇక బుల్లితెర సెలబ్రిటీస్, సోషల్ మీడియా సింగర్స్, వంటి వాళ్ళు చాలామంది రాబోతున్నారు. ఇక ఈ సీజన్ లో జబర్దస్త్ ఇమ్మానుయేల్, సీరియల్ నటి తేజస్విని గౌడ, నవ్యస్వామి, హీరో సుమంత్ అశ్విన్, డెబ్జానీ, నటుడు సాయి కిరణ్, రీతూ చౌదరి, చిట్టి పికిల్స్ అలేఖ్య వంటి వాళ్లంతా పాల్గొనబోతున్నారనే విషయం తెలుస్తోంది. బిగ్ బాస్ ఈ సీజన్ ని దుమ్ము రేపెలా డిజైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే కొత్త కొత్త చేంజెస్ ని కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.