English | Telugu

దయచేసి మా ఇంటికి, సెలూన్ కి రాకండి : ఆదిరెడ్డి

కొందరు సెలబ్రిటీలు ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నాక ప్రాబ్లమ్స్ లో పడతారు. ఎంత అంటే వొరి బాబు మీ అభిమానానికో దండం రా సామి అనేంతలా సమస్యని ఎదుర్కుంటారు. ఎక్కడైన సరే అతి మంచి అనేది పనికిరాదని తాజాగా ఆదిరెడ్డి చెప్పిన ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు ప్రతీ ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇచ్చిన అదిరెడ్డి.. కామన్ మ్యాన్ కేటగిరీలో సీజన్ సిక్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ లో జెన్యున్ ప్లేయర్ అంటే ఆదిరెడ్డి తన ఆటతీరుని కనబరిచేవాడు.

ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి రెగ్యులర్ గా రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం తాజాగా ఓ వీడియోని అందరికి షేర్ చేయమంటు చెప్పాడు. తనని కలవడానికి ఇంటికి, సెలూన్ కి వచ్చి ఆదిరెడ్డి ఎక్కడ.‌. ఎప్పుడొస్తాడు. కలిసి మాట్లాడలని చెప్తూ కొంతమంది నన్ను అభిమానించే ఫ్యాన్స్ వస్తున్నారంట. అది చాలా ఇబ్బందిగా ఉంది‌.‌ అయిన ఏదైన ప్రాబ్లమ్ ఉంటే ఇన్ స్ట్రాగ్రామ్ , యూట్యూబ్ లోనో అడగాలి కానీ ఇలా ఇంటికి రావడమేంటి. అలా వచ్చినవాళ్లవి నిజంగా సమస్యలా అంటే అదేం ఉండదు.. యూకే, యూఎస్ ఏ వెళ్ళాలని అంటున్నారు. నేనేమైనా గవర్నమెంటా లేక ఎమ్ఎల్ఏ నా.. ఏదైనా డబ్బు సహాయం కావాలంటే ఎవరికీ సాయంచేయని డబ్బున్న వాళ్ళని అడగాలి కదా‌.. నేను నాకు తోచినంతలో లేనివాళ్ళకి సహాయం చేస్తున్నా అంతే కానీ ఇలా ఇంటికి రావటం ఏం బాలేదు. అలా ఎవ్వరు చేయకండి అంటు ఆదిరెడ్డి వీడియో‌ని త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు.

కాగా ఈ వీడియోకి చాలారకాల కామెంట్లు వస్తున్నాయి. మీరు చెప్పింది కరెక్ట్ బ్రో అని ఒకరు, కంప్లీట్లీ రాంగ్ స్టేట్ మెంట్ అంటు మరొకరు.. అతిమంచితనం పనికిరాదని ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. దయచేసి ఎవరు ఇంటి దగ్గరికి గానీ సెలూన్ దగ్గరకి గానీ రాకండి. ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి అంటు ఈ వీడియోలో నొక్కి చెప్పాడు ఆదిరెడ్డి. అయితే కొన్ని రోజుల క్రితం ఆదిరెడ్డిని ఒకడు దారుణంగా మోసం చేశాడంటూ వీడియో వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఇది ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది‌. ఏదైన సరే అతి అభిమానం కూడా మంచిది కాదని ఇలాంటివి జరిగినప్పుడే కొంతమందికి తెలుస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.