English | Telugu
షణ్ముఖ్ అసలు క్యారెక్టర్ బయటపడింది.. ఇంత నీచమా!
Updated : Dec 9, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 క్లైమాక్స్‌కి చేరుకుంటున్నా కొద్దీ నీళ్లేవో పాలేవో... కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో బయటపడుతోంది. ఎవరిది నీచమైన క్యారెక్టరో.. ఎవరు కడిగిన ముత్యమో తేలిపోతోంది. టాస్క్‌ని టాస్క్‌లా చూడలేని వాళ్లు ఎవరు? .. చిన్న ఇష్యూని బూతద్దంలో పెట్టి రాద్ధాంతం చేస్తుంది ఎవరో అభిమానులకు బుధవారం ఎపిసోడ్‌తో పిచ్చ క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా బుధవారం ఎపిసోడ్ ఇంటి సభ్యుల్లో ఎవరిది నీచమైన క్యారెక్టరో బయటపెట్టేసింది.
బుధవారం బిగ్‌బాస్ 95వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. కాజల్ - మానస్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చతో ఎపిసోడ్ మొదలైంది. షణ్ముఖ్ .. సిరిని ప్రతీ విషయంలో కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందిని..కళ్లతోనే తనని కంట్రోల్ చేస్తున్నాడని.. ఇలా అయితే తను తన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వుందంటాడు మానస్. "హౌస్‌లో కొనసాగడం కోసం సిరి అలా చేస్తోందంటే నేనునమ్మను" అంటుంది కాజల్. ఇక షన్నుని ఇమిటేట్ చేసి ఎక్కడో కాలేలా చేశాడు సన్నీ అది నచ్చని షన్ను .. సిరిని టార్గెట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిరి తల్లి హౌస్‌లోకి వచ్చిన సందర్భంలో హగ్గులు నచ్చడం లేదని చెప్పిన మాటల్ని షన్ను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ సిరిని మానసిక హింసకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది.
"అన్నీ నీ ఇష్టమే.. ఇక్కడ నుంచి వెళ్లిపో.. మిగతా హౌజ్ మేట్స్ ఎలాగే నువ్వూ అంతే... నీ కాలుకి దెబ్బ తగిలితే నేను ఆయింట్మెంట్ రాశా. దానికి నువ్ ఇస్తున్న రెస్పెక్ట్ ఇదీ.. నేను వందసార్లు ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకోను.. నెగిటివ్‌గా ఆలోచిస్తున్నాడు అని అనను. నువ్ నాకు అవసరం లేదు. నువ్ నాతో మాట్లాడొద్దు.. వెళ్లిపో.. నా ఎమోషన్ నీకు ఎప్పుడూ గుర్తుకు రాదు... నువ్ నా కోసం ఏమీ చేయలేదు. ప్రతిదానికీ నువ్వే కరెక్ట్. నేను కోపంలో మాట అనేస్తా.. నువ్వే గెలుస్తావ్.. అవతల వాడిని ఆయన ఆయన అంటావ్ .. నన్ను అరేయ్ అంటావ్ ... వెళ్లు బే అంటావ్.. అంత చనువు ఇచ్చాను నీకు.
మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వవు.. నేను నీ గురించి ఎంతో ఏడుస్తూ ఎవడైనా గోకుతుంటే ఆపుతా..అవతల వాడి ముందు నేను తక్కువైనా పర్లేదు అని నేను అనుకుంటా.. మీ మమ్మీకి ఇవన్నీ కనిపించవు.. హగ్ ఒక్కటే కనిపిస్తుంది"అంటూ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు షణ్ముఖ్. ఇలా నోటికి ఏదొస్తే అది పేలుతూ తన క్యారెక్టర్ ఎంత నీచమైనదో తానే బయటపెట్టేసుకోవడం షణ్ముఖ్‌కి ఓట్లేస్తున్న వారిని విస్మయానికి గురిచేస్తోంది.