English | Telugu

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు...అసలు ఏమి జరిగింది?

బిగ్ బాస్ సీజన్-9 ఊహించని మలుపులతో ట్విస్ట్ లతో ముందుకు సాగుతోంది. హౌస్ ని వాంటెడ్ పేటగా మార్చిన బిగ్ బాస్.. అందులోని వారిని దొంగల్ని చేశాడు. ఇక గత వారం నుండి సాగుతోన్న ఈ టాస్క్ ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది.

డీమాన్ పవన్, గౌరవ్ ల కండబలంతో మొదటి టాస్క్ లో బ్లూ టీమ్ గెలవగా హౌస్ మేట్స్ కి రెండవ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటివరకూ మీరు మీ చేతులకి కాళ్లకి ఉన్న దమ్మేంటో చూపించారు ఇప్పుడు మీ నోటికి ఉన్న దమ్మును కూడా చూపించే సమయం వచ్చింది.. అందుకు మీకు ఇస్తున్న ఛాలెంజ్ హ్యూమన్ ఫౌంటైన్.. ఈ టాస్కులో ప్రతీ గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు. బజర్ మోగినప్పుడల్లా ప్రతీ గ్యాంగ్ నుంచి ఒక్కో పోటుగాడు ముందుకొచ్చి తమ నోటిలో నీళ్లు నింపుకొని ఎదురుగా ఉన్న బకెట్స్‌లో నీటిని స్ప్రే చేయాలి.. ఎవరి స్ప్రే అయితే దూరంగా ఉన్న బకెట్లో పడుతుందో ఆ పోటుగాడు ఆ రౌండ్ విజేత అవుతాడు. ఇలా ఏ గ్యాంగ్ ఎక్కువ రౌండ్స్ గెలిస్తే ఆ గ్యాంగ్ విజేతగా నిలుస్తుంది.. మీ గ్యాంగ్ లీడర్‌కి వెయ్యి రూపాయల బీబీ క్యాష్ లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో కూడా సంజన బ్లూ టీమ్ గెలిచింది. విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్స్ కోసం గెలిచిన గ్యాంగ్ లీడర్ ముందు ఓడిన గ్యాంగ్ వాళ్లందరూ మోకాళ్లపై ఉండి మీరు తోపు మేము తుప్పాస్ అని చెప్తూ సలామ్ కొట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో సంజన ముందు మాధురి టీమ్ అంతా కూర్చొని చెప్పినట్లే చెప్పింది. కాసేపటికి ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పాలని బిగ్‌బాస్ అడిగాడు. తనూజ దగ్గర అందరికంటే అత్యధికంగా ఏడు వేల బీబీ క్యాష్ ఉంది. ఇక రాము, రమ్యల దగ్గర జీరో ఉంది. దీంతో రాము-రమ్య దగ్గర ఉన్న డబ్బు సున్నా కనుక వారు కంటెండర్ రేసు నుంచి తప్పుకుంటారు. వాళ్ల ఫొటోలకి మాలలు వేయండి అని బిగ్‌బాస్ చెప్పాడు.

ఆ తర్వాత హౌస్ దద్దరిల్లేలా భారీ సైరెన్లు వేసాడు బిగ్‌బాస్.‌ కాసేపటికి మాజీ కంటెస్టెంట్లు అమర్‌దీప్-అర్జున్ అంబటి పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్‌ని పట్టుకోవడానికి వచ్చాం.. సంజన సైలెన్సర్, మాస్ మాధురి.. ఎక్కడా అంటూ అర్జున్ అడిగాడు. వీళ్లు వస్తున్నారని బిగ్‌బాస్ ముందే చెప్పడంతో సంజన-మాధురి లోపల దాక్కున్నారు. ఇక వాళ్లిద్దరూ లేరు సర్ అంటూ హౌస్‌మేట్స్ అంతా వాళ్లని కాపడటానికి ట్రై చేశారు. ఇలా కాదని మొత్తం హౌస్ అంతా తిరుగుతూ అమర్-అర్జున్ సెర్చ్ చేశారు. తర్వాత ఎవరైనా ఏమైనా కొట్టేశారా.. అని అడిగితే మేము ఏం కొట్టేయలేదు సర్ అంటూ ఇమ్మూ అతి వినయంగా చెప్పాడు. దీంతో హౌస్‌లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సర్.. అవి తీసుకొస్తే మీరు ఉంటారు సర్ లేకపోతే మాతో పాటే మెయిన్ డోర్ నుంచి బయటికి వస్తారు సర్ అంటూ అమర్ బెదిరించాడు. తర్వాత ఒక్కొక్కరి బెడ్ దగ్గరికెళ్లి హౌస్‌మేట్స్ దాచిన ఫుడ్ అన్నీ బయటికి తీశాడు అమర్. హౌస్ మేట్స్ వారి బెడ్ దగ్గర కబోడ్ లో దాచుకున్న ఎగ్స్, ఫ్రూట్స్ అన్నీ చూసి అమర్ దీప్ షాకయ్యాడు. కాసేపటికి మారువేషాలు వేసుకొని దాక్కున్న మాధురి, సంజనలు బయటకొచ్చేశారు. మరి అమర్ దీప్, అంబటి అర్జున్ కలిసి ఆ దొంగలని కనిపెడతారా లేదా తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.