English | Telugu

90 స్ బెస్ట్.. విష్ణుప్రియను ఆంటీ అన్న పృథ్వి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ ని 90 స్ స్టార్స్ వెర్సెస్ జెన్ జి స్టార్స్ అంటూ రాబోతోంది.. ఇక అవినాష్, హరి ఐతే జెన్ జి స్టార్స్ లా కొంచెం హైఫైలా ఉండడానికి ట్రై చేసి నవ్వించారు. 4 జి తర్వాత వస్తుంది 5 జి నేనొక జెన్ జి అంటూ హరి చెప్పేసరికి ఏంటి గంజా అంటూ అవినాష్ కౌంటర్ వేసాడు. ఇక పృథ్వితో పాటు ఇంకొంతమంది లేడీస్ కూడా వచ్చేసరికి శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. "నాకు జెన్ జి టీమ్ వచ్చినట్టు అనిపించలేదు పృద్వి ఏదో తన గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినట్టు అనిపించింది..నువ్వు వస్తే ఎపిసోడ్ కి రావాలని విష్ణు ప్రియా వెయిట్ చేస్తూ ఉంటుంది" అనేసింది.

"హే మేము ఆంటీలని" అని పృద్వి అనేసరికి శ్రీముఖి "ఆంటీ" అని గట్టిగా అరిచింది. ఇక తర్వాత విష్ణు ప్రియా స్టేజి మీదకు వచ్చేసరికి "ఆయన నిన్ను ఆంటీ అన్నాడే" అని చెప్పి పాపం శ్రీముఖి ఏడుపు ముఖం పెట్టేసరికి విష్ణుప్రియ బిత్తరపోయింది. "ఒక పక్కన నీ ఏజ్ తెలిసిపోయినా ఇంత ముసల్ది అంత చిన్నోడిని చేసుకుని అంటే నేను ముసల్దాన్నే " అంటూ శ్రీముఖి తెగ కవర్ చేసింది. ఇక తర్వాత డెబ్జానీ దగ్గరకు వెళ్ళింది. "90 స్ బెస్ట్ ఎందుకు" అని అడిగేసరికి "వాళ్ళల్లో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు ఫుల్ నిబ్బిలు " అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక మహేశ్వరీ ఐతే నేను 1999 లో పుట్టాను అంటూ ఇంగ్లీష్ లో చెప్పేసరికి శ్రీముఖి ఇది తెలుగు షో తెలుగులో మాట్లాడు అంది. "వెరీ క్రిన్జ్ యాంకర్" అంటూ మళ్ళీ ఇంగ్లీష్ లో మహేశ్వరీ తిట్టేసరికి "దీన్ని తీసేయండిరా షో నుంచి" అనేసింది శ్రీముఖి.