English | Telugu
Bigg Boss 9 Telugu: మాధురి టీమ్ ని మట్టిలో పాతేసిన డీమాన్.. కండబలంతో బ్లూ టీమ్ విన్!
Updated : Oct 24, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం దొంగల టాస్క్ తో ముందుకు సాగుతోంది. మాధురి వర్సెస్ సంజనగా సాగుతున్న ఈ దొంగల టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, దివ్య, మాధురి ఎక్కువ బిబి కాయిన్స్ సేకరించి లీడింగ్ లో ఉన్నారు.
ఇక నిన్నటి(గురువారం) ఎపిసోడ్ లో ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఏ గ్యాంగ్‌స్టర్ అయిన తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం.. ఆ బలంతోనే వారు వారి ప్రత్యర్థులను అణిచివేయగలుగుతారు..ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం 'జెండాలే మీ అజెండా'.. ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్‌లోని బలమైన మరియు దమ్మున్న ఇద్దరు పోటుగాళ్లని ఎంచుకొని వారిని ఈ పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి.. ప్రతీ గ్యాంగ్ నుంచి ఇద్దరు పోటుగాళ్లు వచ్చి తమకి ఇచ్చిన బెల్ట్‌ని ధరించి అక్కడున్న మడ్ పిట్‌లో నలుగురు పోటుగాళ్లు ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లాగ్స్ ఉన్న వైపు నిలబడాల్సి ఉంటుంది.. స్టార్ట్ బజర్ మోగగానే అందులో ఉన్న మీ టీమ్ కలర్ ఫ్లాగ్స్‌ని మరియు బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్‌ని సంపాదించి మీ బాస్కెట్‌లో పెట్టాలి.. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది.. మరియు ఆ గ్యాంగ్ లీడర్‌కి ఐదు వేల బీబీ క్యాష్ వస్తుంది. మీ టీమ్ కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతీ ఫ్లాగ్‌కి ఒక పాయింట్ లభిస్తుంది.. ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా ఐదు పాయింట్లు లభిస్తాయని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు.
ఈ గేమ్‌కి సంజన టీమ్ తరఫున డీమాన్-గౌరవ్ పాల్లొనగా మాధురి గ్యాంగ్ తరపున ఇమ్మాన్యుయల్-కళ్యాణ్ బరిలోకి దిగారు. ఇక గేమ్ ఇలా మొదలైందో లేదో డీమాన్-గౌరవ్ ఇద్దరూ రెచ్చిపోయారు. కళ్యాణ్-ఇమ్మూలని తమ జెండాలవైపు బలంగా లాక్కొని వెళ్లిపోయారు. డీమాన్ అయితే ఇద్దరిని ఈడ్చుకుంటూ జెండాలని తమ బాస్కెట్లో వేస్తూ పోయాడు.ఈ దెబ్బతో రెడ్ టీమ్ కనీసం ఒక్క జెండా కూడా ముట్టుకోలేకపోయింది. అంతలా డామినేషన్ చూపించాడు డీమాన్. దీంతో ఈ గేమ్‌లో ఏకపక్షంగా డీమాన్-గౌరవ్ గెలిచేశారు. దీంతో సంజన టీమ్‌కి అయిదు వేల బీబీ క్యాష్ వచ్చింది. ఈ టాస్కులో ఓడిపోయినందుకు గాను మాధురి టీమ్ నుంచి ఇమ్మాన్యుయల్.. బిగ్‌బాస్ పేరు ఎత్తిన ప్రతీసారి కోడిలా సౌండ్ చేయాలంటూ బిగ్‌బాస్ ఫన్నీ పనిష్ మెంట్ ఇచ్చాడు. ఇది హిలేరియస్ గా అనిపించింది.
నిన్నటి ఎపిసోడ్ లో డీమాన్ పవన్ అండ్ గౌరవ్ తమ కండబలం చూపించగా బ్లూ టీమ్ గెలిచింది. అయితే ఎక్కువ గేమ్స్ రెడ్ టీమ్ గెలిచి లీడింగ్ లో ఉంది. మరి అత్యధిక బీబీ క్యాష్ ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయో కామెంట్ చేయండి.