English | Telugu

Bigg Boss 9 Telugu Voting : ఓటింగ్ లో తనూజ టాప్.. రమ్య మోక్ష ఎలిమినేషన్ కన్ఫమ్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం హౌస్ లో దొంగలు పడ్డారు. సంజన వర్సెస్ మాధురి ఆడుతున్న ఈ వారం టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, దివ్య నిఖిత బాగా ఆడుతున్నారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేషన్ ఖాయమనిపిస్తోంది.

రీతూ చౌదరి, సాయి, రాము రాథోడ్, తనూజ, రమ్య (పికెల్స్), కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఈ ఏడుగురు ఏడవ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో డేంజర్ కంటెస్టెంట్‌గా ఉన్న పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఇంటికి పంపేందుకు జనం మంచి కసితో ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ ఏది చూసినా కూడా రమ్య లీస్ట్ ఓటింగ్‌ తో ఉంది. తనూజ మాత్రం ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్‌ తో టాప్‌ లో కొనసాగుతుంది.

ఆ తరువాతి స్థానంలో కళ్యాణ్ పడాల ఇరవై శాతం ఓటింగ్ తో ఉన్నాడు. ఇక దివ్య నిఖిత పదకొండు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. నిజానికి గత వారం భరణి ఎలిమినేట్ అయ్యి దివ్య నిఖిత సేవ్ అయింది.. ఈ వారంలో దివ్య టాప్-3లోకి వచ్చేసింది. దీనికి బలమైన కారణం ఉంది. అదే రమ్య మోక్ష. నిజానికి దివ్యకి ఈవారం లీస్ట్ ఓటింగ్ ఉండగా.. ఎలాగైనా రమ్య మోక్షని హౌస్ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న దివ్య నిఖితకి ఓట్లు వేస్తున్నారు ఆడియన్స్. అంటే ఈ రమ్య మోక్ష ఎలిమినేషన్ హౌస్ లో ఉండటం కంటే బయటకి పంపించాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.