English | Telugu

బిగ్ బాస్ 8 హౌస్‌లో చోరి... దొంగను పట్టుకున్న నాగార్జున

బిగ్ బాస్ తెలుగు షోకి ఉండే క్రేజే వేరు. ఇప్పటికే ఈ సీజన్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss season 8) లోగోని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా బిగ్ బాస్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు‌. ఇక ఇప్పుడు ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో కమెడియన్ సత్య దొంగగా , నాగార్జున జీనీగా కన్పించారు. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంటుందో ఈ టీజర్ ద్వారా బిబి టీమ్ ముందుగానే తెలియజేశారు.

అసలు టీజర్ లో ఏం ఉందంటే.. ఓ హౌస్ లోకి దొంగతనానికి ఓ దొంగ వస్తాడు . అతడు అందులోని విలువైన వస్తువలన్నీ చూస్తూ మురిసిపోతుంటాడు. అప్పుడే సడన్ గా జీని ఉండే మాయాద్వీపం కదులుతుంది. ఏంటా అని ఆ దొంగ అక్కడ చూస్తుండగానే.. అందులో నుండి మన జీనీ( నాగార్జున) వచ్చేస్తాడు. ఇక దొంగకి ఏదైనా కావాలని కోరుకో అన్ లిమిటెడ్ గా ఇస్తానని జీనీ అంటాడు. అవునా ఈ విషయం అర్జెంట్ గా మా ఆవిడకి చెప్పాలంటు దొంగ ఫోన్ చేస్తుండగా.. మన జీని అతడిని ఆపుతాడు.

బాబు ఆలోచించుకొని అడుగు.. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ చెప్పేస్తాడు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేదేంటంటే ఈసారి ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదన్నట్టుగా ఉండబోతుందంటూ బిబి మేకర్స్ చెప్పకనే చెప్పారు. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఈ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి.