English | Telugu

Shivaji: ఓటింగ్ లో నెంబర్ వన్ శివాజీ!

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ హవా కొనసాగుతుంది‌. ఏ వారమైన నామినేషన్ లో శివాజీ ఉంటే చాలు.. 70 శాతం ఓటింగ్ పడుతుంది. మిగతా హౌస్ మేట్స్ కి 20 శాతం కూడా రావడం లేదు.

ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. మొదటగా శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది‌. శివాజీని కన్సల్ట్ చేయడానికి డాక్టర్ గా మారిన కొడుకుని గుర్తపట్టలేకపోయాడు శివాజీ. ఇక నాన్న అని కొడుకు అనడంతోనే ఏడ్చేశాడు. ఈ ఎపిసోడ్ మొత్తం టీవీలో చూసే ప్రతీ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. నాన్న కొడుకులది ఒక ప్యూర్ బాండింగ్ ఉంటుందని ఈ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఓటింగ్ లో భోలే షావలి, గౌతమ్, యావర్, రతిక, శివాజీ
మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో శివాజీ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో భోలే షావలి ఉన్నాడు. ఆ తర్వాత యావర్ ఉన్నాడు.

ఇక డేంజర్ జోన్ లో గౌతమ్ కృష్ణ, రతిక ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న శివాజీకి అత్యధిక ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే హౌస్ మొత్తంలో ఫెయిర్ గేమ్ ఆడేది ఇతనే కాబట్టి. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కూడా శివాజీతో మనం కావాలని ఓటింగ్ చేద్దామని చెప్పాడు. కానీ శివాజీ అలా చేయకూడదని చెప్పాడు. హౌస్ లో ఉన్నన్నిరోజులు ఫెయర్ గా ఆడుదాం, ఫెయిర్ గా ఉందామంటూ జనాల హృదయాలని గెలుచుకుంటున్నాడు శివాజీ‌. అందుకేనేమో మొన్న శివాజీ కొడుకు వచ్చిన ఎపిసోడ్ కి అత్యధిక టీఆర్పీ వచ్చింది.