English | Telugu
Rathika Elimination : రతిక మళ్లీ ఎలిమినేషన్!
Updated : Nov 9, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 లో పాటబిడ్డగా అడుగుపెట్టిన భోలే షావలి.. తన పాటలతో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్ననాడు. హౌస్ లో అందరితో కలిసిపోతు చమత్కారం చేస్తూ ప్రేక్షకులకి కిక్కు ఇస్తున్నాడు. అందువల్లే నామినేషన్ లో ఉన్న భోలే షావలికి భారీగా ఓటింగ్ పడుతుంది.
గతవారం టేస్టీ తేజ, రతిక ఎలిమినేషన్ లో ఇద్దరు ఉన్నప్పుడు.. ఈ ఒక్కవారం నన్ను ఈ హౌస్ లో ఉండనీయండి సర్. నా ఆటేంటో చూపిస్తా అని నాగార్జునతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డేంజర్ జోన్ లో గౌతమ్ కృష్ణ, రతిక ఉన్నారు. మరీ ఈ వారం మరో ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతుందా లేక బిగ్ బాస్ ఉల్టా పల్టా చేసి గౌతమ్ కృష్ణని పంపిస్తాడా చూడాలి. గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మ నిన్న చెప్పినట్టుగా గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగానే ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అతనికి నిజంగానే ఫ్యాన్ బేస్ ఉంటే నామినేషన్ లో లీస్ట్ లో ఉండేవాడు కాదు. ఇక రతిక తన మాటతీరు ఏం మార్చుకోమపోవడం, యావర్ ఆటని డిస్టబ్ చేయడం ఇవన్నీ ప్రేక్షకులలో తనని మరింత నెగెటివ్ చేశాయి. భోలే హౌస్ లో పాడిన అమ్మ పాట ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. అప్పటికప్పుడు లిరిక్స్ అనుకొని పాటతో పాటు మ్యూజిక్ చేస్తున్న భోలే షావలికి ఫ్యాన్ బేస్ రోజురోజుకి గట్టిగానే పెరుగుతుంది.
నిన్న జరిగిన ఫ్యామీలీ వీక్ ఎపిసోడ్ లో పాటబిడ్డ భోలె షావలి తన భార్యతో మాట్లాడిన తీరు, పాటలతో అలరించిన తీరుకి ప్రేక్షకులలో మరింత క్రేజ్ ఏర్పడినట్టు తెలుస్తుంది. ఓటింగ్ భారీగా పెరిగింది. నామినేషన్ లో ఉన్న అయిదుగురిలో శివాజీ నెంబర్ వన్ గా ఉండగా ఆ తర్వాత స్థానంలో భోలే షావలి ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాలలో యావర్, గౌతమ్, రతిక ఉన్నారు. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఎవరికి గేమ్ ఆడేంత స్కోప్ లేదు. ఇక వారి ఫ్యాన్ బేస్ బట్టి ఓటింగ్ జరుగుతుంది. భోలే షావలికి అత్యధిక ఓటింగ్ రావడం చూసి బిగ్ బాస్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. మరి ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.