English | Telugu

అమర్ దీప్ కి షాకిచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. గత నాలుగు రోజుల నుండి ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఫ్యామీలీ వాళ్ళు రావడంతో ఎమోషనల్ గా మారుతుంది. శివాజీ కొడుకు వెంకట్, ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్, అశ్వినిశ్రీ వాళ్ల అమ్మ, భోలే షావలి భార్య వచ్చారు.

ఇక నేటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్లు తెలుస్తోంది. అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ కేక్ పంపించాడు. " అమర్ దీప్ కన్ఫెషన్ రూమ్ కి రండి" అని బిగ్ బాస్ అనగానే.. హౌస్ మేట్స్ అందరు తేజస్విని గౌడ వచ్చిందనకున్నారు. కానీ అమర్ దీప్ కి కేక్ చూపించి.. మీ కోసం తేజు కేక్ పంపించిందని బిగ్ బాస్ చెప్పడంతో.. అందరి ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. తేజు వస్తుందేమోనని అనుకున్నాను.‌ మిస్ యూ తేజు అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక తేజస్విని గౌడ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తేజస్విని చూసిన అమర్ దీప్ వెళ్ళి హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.

మనం మళ్ళీ పెళ్ళి చేసుకుందామా అని తేజుతో అమర్ దీప్ అనగానే.. సరే అని అంది. చాలా మిస్ అయ్యాను. ‌కొన్ని కొన్ని సార్లు నాలో‌ నేనే ఏడ్చాను. కొన్నిసార్లు ఏడిస్తే కనపడుతుందని చెప్పి ఎవరికి తెలియకుండా ఏడ్చానని అమర్ దీప్ ఎమోషనల్ అయ్యాడు. తిను, పడుకో అని తేజస్విని అంది. ఏజ్ పెరిగేకొద్ది యంగ్ అవుతున్నానని అమర్ దీప్ అనగానే.. సర్లే అని అంది‌. ఇక గార్డెన్ ఏరియాలో తేజస్విని మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళిద్దరి ఎంగేజ్ మెంట్ ఇస్తుండగా.‌. శివాజీ మధ్యలో కలుగజేసుకొని అమర్ దీప్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తేజస్విని చేత రింగ్ తొడిగించాడు. ఇదంతా సరదాగా సాగింది.