English | Telugu
ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒకరేనా?
Updated : Oct 26, 2021
ప్రస్తుతం 'బిగ్ బాస్'లో ఆరుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో... యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్ మానస్, యూట్యూబర్లు సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్, నటుడు లోబో నామినేట్ అయ్యారు. సో... ఈ ఆరుగురిలో ఎవరో ఒకరు ఈ వారం బయటకు వెళతారన్నమాట!
పందొమ్మిది మందితో అట్టహాసంగా ప్రారంభమైన 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రస్తుతం పదమూడు మంది మాత్రమే ఉన్నాయి. గడచిన ఏడు వారాల్లో ఏడుగురు సభ్యులు బయటకు వెళ్లారు. ఇప్పటికి షో మొదలై యాభై రోజులు గడిచింది. ఇప్పటినుండి మరింత ఆసక్తిగా ఉండబోతుందని సోమవారం ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతోంది.
యాంకర్ రవి గత కొన్ని వారాలుగా నామినేట్ అవుతూ వస్తున్నాడు. కానీ, అతడు షో నుండి బయటకు రావడం లేదు. అలాగే, శ్రీరామ చంద్ర కూడా. వాళ్ళిద్దరికీ బయట ఫ్యాన్ బేస్ బలంగా ఉండటంతో ఓట్లతో గట్టెక్కుతున్నారు. షణ్ముఖ్, సిరి యూట్యూబర్లు కావడంతో వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఓట్లు వేస్తున్నారు. ఈ వారం మానస్ లేదా లోబోలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం.