English | Telugu

మురారి చనిపోయాడని భవాని కన్నీటి పర్యంతం.. కృష్ణకి నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.. కృష్ణని చూడడానికి ప్రభాకర్, శకుంతల వెళ్తారు.. కృష్ణని ఆ సిచువేషన్ లో చూసి ఇద్దరు బాధపడుతారు. అప్పుడే కృష్ణ స్పృహలోకి వస్తుంది. ఆక్సిడెంట్ జరిగిన విషయాన్ని గుర్తుకుచేసుకొని ఒక్కసారిగా ఏసీపీ సర్ ఎక్కడ అంటూ అడుగుతుంది. ఆ తర్వాత తనతో పాటు మురారి ఉన్న విషయం కూడా ప్రభాకర్ కి చెప్తుంది కృష్ణ.

మరొక వైపు ప్రభాకర్ మురారి కోసం వెతుకుతుంటాడు. మరొక వైపు రేవతి వచ్చి.. ఏమైనా కావాల అని భవానిని అడుగుతుంది. రేవతితో భవాని మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా ప్రసాద్ తో మాట్లాడుతుంది. మీరు ఒక ముకుంద మాటలు పట్టుకొని వాళ్లని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పు. వాళ్ళకి ఒకరంటే ఒకరు ఇష్టమని రేవతి అనగానే.. రేవతిపై భవాని అరుస్తుంది. నువ్వు కూడ ఒక్క మాట కూడా చెప్పలేదని అంటుంది. నువ్వు తప్పని అనుకోవడం లేదు కనీసం వాళ్ళైన తప్పని అనుకుంటున్నారు. దానికి సంతోషమని భవాని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో ఇంట్లో ఎవరు మాట్లాడడానికి వీలు లేదని భవాని చెప్తుంది. మరొక వైపు ముకుంద దేవుడికి మొక్కుతూ.. నేను చేసేది తప్పే నన్ను క్షమించండి. ఇప్పుడు జరగబోయే విషయం పట్ల అందరూ ఎలా రియాక్ట్ అవుతారో భయం వేస్తుందని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇంకా ఫోన్ చెయ్యడం లేదు ఏంటని రేవతి అనుకుంటుంది.

ఆ తర్వాత భవాని ఇంటికి అంబులెన్స్ వస్తుంది. ఒక కానిస్టేబుల్ వచ్చి మురారి గారికి దెబ్బలు తగిలి చనిపోయాడని చెప్పి మురారి బాడీని భవాని వాళ్లకి ఇస్తాడు. మురారిని ఆ సిచువేషన్ లో చుసిన ఇంట్లో అందరూ ఏడుస్తుంటారు. మరొక వైపు ప్రభాకర్ అన్ని చోట్ల మురారి గురించి వెతికి భవాని ఇంటికి వచ్చి మధుకి కాల్ చేస్తాడు. మధు ఫోన్ లిఫ్ట్ చేయకుండా, బయటకు వచ్చి ప్రభాకర్ కి జరిగింది చెప్తాడు. ఇంట్లో అందరు కృష్ణ ఎక్కడికి వెళ్ళిందని చాలా కోపంగా ఉన్నారని మధు చెప్పగానే.. ప్రభాకర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.