English | Telugu
Bigg Boss Buzzz : ప్రోమోతో దుమ్ములేపుతున్న అర్జున్!
Updated : Aug 29, 2024
తెలుగు బిగ్ బాస్ సీజన్-8 కి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక కంటెస్టెంట్స్ ఎవరా అనే క్యూరియాసిటి అందరిలో పెరిగిపోయింది. ఈ తరుణంలో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసేది ఎవరో కూడా కన్ఫమ్ చేస్తూ బిబి టీమ్ ప్రోమోని వదిలారు.
ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్-7 లో టాప్-5 లో నిలిచిన కంటెస్టెంట్ అంబటి అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతనికి ఎలివేషన్స్ మాములుగా లేవు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. బజ్ ప్రోమోతోనే నమ్మకాలు కలిగించేశాడు అంబటి అర్జున్. ప్రోమో మాత్రం అద్దిరిపోయింది. నిజం చెప్పాలంటే.. హోస్ట్ నాగార్జున ప్రోమో కంటే కూడా అంబటి అర్జున్ బజ్ ప్రోమోనే బాగుంది. ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఉన్నాయి.
అంబటి అర్జున్ ఈ ప్రోమోతోనే అంచనాలు పెంచేశాడు. పిక్చరైజేషన్.. ఎలివేషన్స్.. డైలాగ్స్.. ఆర్ ఆర్.. అద్దిరిపోయింది. టైమ్ బాగుంటే బిగ్ బాస్ హౌస్‌కి వస్తారు.. వాళ్ల టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వస్తారు.. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండి.. ఈ సీటూ యమ హాటూ అంటూ అంబటి అర్జున్ చెప్పాడు.