English | Telugu

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున హిట్టా? ఫట్టా?

బిగ్ బాస్ సీజన్-7 సక్సెస్ అవ్వడానికి కంటెస్టెంట్స్ ఒక కారణం అయితే హోస్ట్ మరోక కారణం. మరి గత సీజన్ లతో పోలిస్తే నాగార్జున ఈ సీజన్ లో ఏం చేసాడో ఓసారి చూద్దాం...

బిగ్ బాస్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రతీ వారం కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ చెప్తూ వారికి క్లాస్ పీకుతూ అదరగొట్టాడు నాగార్జున. ఇక సీరియల్ బ్యాచ్ చేసే ప్రతీ ఫౌల్ ని ప్రతీ వీకెండ్ లో పెద్ద టీవీలో చూపిస్తూ అదరహో అనిపించాడు. అయితే అమర్ దీప్ చాలాసార్లు ఫౌల్ గేమ్ ఆడాడు. పల్లవి ప్రశాంత్ ని చులకన చేసి మాట్లాడాడు. అయిన ఎక్కువగా తిట్టకపోగా.. నువ్వింతేనా అన్నట్టు సరదాగా మాట్లాడటం చాలామందికి నచ్చలేదు. అయితే శివాజీ చేతి గాయం గురించి ప్రతీ వీకెండ్ లో నాగార్జున అడిగి తెలుసుకున్న విధానం, టాస్క్ లలో పక్షపాతం లేకుంటా నిర్ణయాలు తీసుకువాలని కంటెస్టెంట్స్ సూచిస్తుండటం .. ఇవన్నీ కూడా అదనపు బలాన్ని చేకూర్చాయి. పల్లవి ప్రశాంత్ ఆటతీరుని గుర్తించి తోటి హౌస్ మేట్స్ తో చప్పట్లు కొట్టించడం ఎంతగానే ఆకట్టుకుంది. యావర్ అటిట్యూడ్ కరెక్ట్ కాదని.. గౌతమ్ కి మాస్ వార్నింగ్ ఇవ్వడం.. టేస్టి తేజతో శోభా టాటు వేయించుకోమని చెప్పడం ఇవన్నీ నాగార్జున నోటివెంట రావడం ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇక ఒక టాస్క్ లో ఆట సందీప్ సంఛాలక్ గా ఉండి.. బొక్క అని వాడతాడు. ఇక దానిని వీకెండ్ లోకి నాగార్జున తీసుకొచ్చి.. తొక్కలో సంఛాలక్, బొక్కలో గేమ్ అని నాగార్జున అనడంతో హోస్ట్ గా ప్రతీ ఎపిసోడ్ దగ్గరుండి చూసినట్లుగా అనిపించింది. ‌

ఈ సీజన్ లో ఉల్టా పుల్టా ట్విస్ట్ లకు పెద్దపీట వేసాడు బిగ్ బాస్. అసలు ఏ సీజన్ లో ఇన్ని గేమ్ లు ఆడించలేదు. హాలోగ్రామ్, పవరస్త్ర, హౌస్ మేట్ అంటూ కొన్ని కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులకు అదిరిపోయో ట్విస్ట్ లు ఇవ్వగా నాగార్జున వాటిని సరైన సమయంలో సరైన విధంగా హౌస్ మేట్స్ తో మాట్లాడటానికి వాడాడు. ఇక ప్రతీ వీకెండ్ కంటెస్టెంట్స్ లని ఒకవైపు తిడుతూ, మరోవైపు ఆటపాటలతో అలరించాడు నాగార్జున. ఇక హౌస్ లో మొక్క బ్యాచ్, చుక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ అని నాగార్జున చెప్పడంతో హౌస్ మేట్స్ బుర్రలు పాడయ్యాయి.‌ సీరియల్ బ్యాచ్ చుక్క బ్యాచ్ అని గ్రహించి ఇంక ఆ తర్వాత మరీ రెచ్చిపోయారు. ఇక అమర్ దీప్ అయితే నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ చేస్తా అంటు తెగించి చెప్పసాగాడు. ప్రతీ వీకెండ్ ఎపిసోడ్‌ లలో నాగార్జున ఇచ్చిన క్లూస్ తో హౌస్ మేట్స్ తమ ఆటని మరింత మెరుగుపరుచుకున్నారనేది కాదనలేని నిజం. ఇక ఈ సీజన్ గ్రాంఢ్ విక్టరీ సాధించాడానికి రైతుబిడ్డ, శివాజీ, యావర్, సీరియల్ బ్యాచ్ ఓ కారణమైతే.. హోస్ట్ నాగార్జున మరో కారణమని చెప్పొచ్చు.