English | Telugu
Bigg Boss 9 Telugu : ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. గాయాలతో భరణి!
Updated : Oct 30, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో అనుకోని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అని, ఆ తర్వాత శ్రీజ ఎలిమినేషన్, భరణి ఎలిమినేషన్ జరిగాయి. ఆ తర్వాత బయటకొచ్చేసిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళి నామినేషన్ చేయడం అనేది మరో ట్విస్ట్. ఇలా రోజోక ట్విస్ట్ తో ఈ సీజన్-9 ముందుకు సాగిపోతుంది. ఇక శ్రీజ, భరణిలలో ఎవరు హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారనేది ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరికి బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో భరణి, శ్రీజల టీమ్ కి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో మొదటి రౌండ్ లో శ్రీజ టీమ్ విన్ అయింది. రెండో రౌండ్ కి అందరు ఒకరికొకరు లాక్ చేసుకొని ఎవరు బాక్స్ లో కాయిన్స్ పెట్టలేదు. దాంతో ఇద్దరిలో ఎవరికి పాయింట్స్ రాలేదు. అయితే ఈ రౌండ్ లో డీమాన్ పవన్ ని లాక్ చేసే క్రమంలో భరణి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు.
వెంటనే దివ్య తన దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ని పిలవాలని చెప్తుంది. భరణి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు.. రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ పిలుస్తామని చెప్తారు. కాసేపటికి భరణిని డాక్టర్ పిలుస్తాడు. మీరు త్వరగా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలని మెయిన్ డోర్ నుండి బయటకు రండి అని చెప్తాడు.. దాంతో భరణి అందరికి చెప్పేసి హౌస్ లో నుండి బయటకు వస్తాడు. ఇక ఎప్పటిలాగే భరణి కుటుంబం బాధలో ఉంటుంది ఎప్పుడెప్పుడు మళ్ళీ భరణి ఎంట్రీ ఇస్తాడా అని గేట్ దగ్గరే చిన్న కూతురు తనూజ, పెద్ద కూతురు దివ్య, అన్నయ్య, తమ్ముడు ఇలా అందరు వెయిట్ చేస్తుంటారు.
ఇక మరుసటిరోజు భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అందరు పరామర్శించిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడు. భరణి బయటకు వెళ్లి వచ్చేలోపే మధురి, తనూజకి కిచెన్ లో గొడవ అవుతుంది. నేను మీ నాన్నకి సపోర్ట్ చెయ్యలేదని అక్కడ కోపం ఇక్కడ చూపిస్తున్నావని తనూజతో మాధురి అనగానే తనపై తనూజ కోప్పడుతుంది. ఇక కిచెన్ లోనే మళ్ళీ తనూజ, సంజనలకి గొడవ అవుతుంది. పప్పు ఎక్కువ వేసుకున్నారని ఇమ్మాన్యుయల్ ని తనూజ అడుగుతుంటే.. అది సంజన వినేస్తుంది. ఎప్పుడు తినేటప్పుడే గొడవ అని తినే ప్లేట్ వదిలేసి సంజన ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక రీతూ, డీమాన్ మధ్య గొడవ మాములే కదా.. ఇద్దరు గట్టి గట్టిగా అరుచుకున్నారు.. అంతలోనే ఒకరికొకరు తినిపించుకోవడం వాళ్ళకి అదో సరదా చూసే మనకో వింతలా అనిపిస్తుంది. కంటెంట్ కోసం రీతూ, డీమాన్ ల చెత్త ట్రాక్ బిగ్ బాస్ చూపిస్తున్నాడు. కానీ అది ఆడియన్స్ కి ఎంతకీ కనెక్ట్ అవ్వడం లేదు. పైగా ఇలాంటివి హౌస్ లో ఉండొద్దంటూ నెగెటివ్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయినా బిగ్ బాస్ మావ వినడు కదా.. ఇదో ట్రాక్ అని ప్లే చేస్తూనే ఉంటారు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.