English | Telugu
'నాగమణి'ని సొంతం చేసుకునేదెవరు?
Updated : Nov 10, 2022
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. దీనికి కారణం మొన్న జరిగిన స్నేక్-లాడర్ గేమ్ లో ఫిజికల్ గా గొడవలు పడటం ఒక కారణం అయితే, నిన్న మొదలైన 'నాగమణి' టాస్క్ మరొక కారణం.
"కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ 'నాగమణి'. ఈ నాగమణిని ఒక టీం సభ్యులు కాపాడుకోవాలి. మరొక టీం సభ్యులు తీసుకోవాలి. ఫైనల్ బజర్ మోగేసరికి ఎవరి దగ్గర ఎక్కువ 'నాగమణి' రత్నాలు ఉంటాయో, వారే ఈ టాస్క్ లో విజేతలు. ఈ టాస్క్ లో ఇనయా, వసంతి సంచాలకులుగా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు. ఇనయా, వసంతి కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి వారి దగ్గర ఉన్న 'బంగారు మణి' ని లాడర్ టీంకి ఇచ్చారు.
కాగా టాస్క్ లో రేవంత్ మళ్ళీ తన అగ్రెసివ్ బిహేవియర్ ని చూపించాడు. కీర్తి భట్ ఎప్పటిలాగే ఏడుపు కొనసాగించగా, ఆదిత్య ఓదార్చాడు. అయితే హౌస్ లో ఏ గొడవకు పోకుండా, తమ గేమ్ తాము ఆడేది రోహిత్, రాజ్ మాత్రమే. కాగా ప్రేక్షకులు ఆదిరెడ్డి ఆటను బాగా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. వసంతి ఎప్పటిలాగే వెనుకాల ఉండిపోయింది. ఇలా ఒక్కొక్కరుగా ఆడుతోన్న హౌస్ మేట్స్ ఒక టీంగా ఆడుతారో? లేదో? చూడాలి మరి. అయితే వీరిలో ఈ నాగమణి టాస్క్ లో ఎవరు గెలుస్తారో? అనే ఉత్కంఠ మొదలైంది.