English | Telugu
ఆకట్టుకుంటోన్న ఆదిత్య ఆట.. బెస్ట్ పర్ఫామర్ గా రాజ్!
Updated : Nov 10, 2022
కంటెస్టెంట్స్ టాస్క్ లో చేసే పర్ఫామెన్స్ ని బట్టి హౌస్ లో ఎవరు ఉండాలో? ఉండకూడదో? అని ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పటిదాకా జరిగిన టాస్క్ లో పర్ఫామెన్స్ పరంగా రాజ్, ఆదిత్య బెస్ట్ ఇస్తూ వస్తున్నారు.
అయితే మొన్న నామినేషన్ జరిగిన తర్వాత మొదలైన పోలింగ్ లో ఆదిరెడ్డి, రేవంత్ మొదటి రెండు స్థానాలలో ఉండగా రాజ్, బాలాదిత్య తర్వాత స్థానాలలో ఉన్నారు. దీనికి కారణం నో ఓవరాక్షన్, నో డ్రామా, సైలెంట్ గేమర్స్. కాగా ఆదిత్య మాత్రం కాస్త డిఫరెంట్. మొన్నటి దాకా అందరు మాస్క్ వేసుకొని నటిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అలా ఉండటం. అతని సహజమైన శైలి అని తెలుస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్ లో ఇనయాకి ఎవరు సపోర్ట్ చేయకపోయిన తను సపోర్ట్ చేసాడు. ఇలా తనని నామినేషన్ చేసిన వాళ్ళతో కూడా కలిసిపోవడం అనేది చాలా ఉత్తమమైన గుణం అని ప్రేక్షకులు భావిస్తోన్నారు. అయితే ఎవరు ఏది అడిగినా ఇస్తూ, ఎవరి దగ్గర నుండి ఏ హెల్ప్ ఆశించకుండా ఉంటున్నాడు. కాగా ఇప్పుడు ఇదే విషయం ప్రేక్షకులను ఆకట్టుకోగా, ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు.
అలాగే రాజ్ కూడా సైలెంట్ గా ఉంటూ, తన అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంటాడు. హౌస్ మేట్స్ తో తన అవసరం ఉంటేనే ముందుకు వచ్చి మాట్లాడటం. ఎలాంటి గొడవలకు పోకుండా హౌస్ లో యూనిక్ గా ఉంటూ వస్తోన్నాడు. ఒక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తనకి చాలా ఓపిక. ఇదే ఇప్పుడు రాజ్ ని బెస్ట్ పర్ఫామర్ ని చేస్తూ, ఇంకా ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పాలి.