English | Telugu

Flora Saini Elimination: ఫ్లోరా సైని ఎలిమినేషన్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఐదో వారం ఫుల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎందుకంటే నిన్నటి వీకెండ్ లో కంటెస్టెంట్స్ కి నాగార్జున ఇచ్చిపడేశాడు‌. అయితే నామినేషన్లో ఉన్న వారిని ఎవరిని నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ చేయలేదు. ఐదోవారం నామినేషన్స్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్‌కి పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. పది మంది ఓటింగ్‌లో పోటీ పడటంతో అతి తక్కువ మార్జిన్‌తో చివరి వరకూ ఐదురుగు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు.

పది మంది నామినేషన్స్‌లో ఉండగా.. తనూజ, భరణి, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజనలకు ఓటింగ్ వ్యత్యాసంలో పెద్దగా తేడా లేదు. ఒకటి రెండు తేడాలో ఈ ఐదుగురు ఓట్లను పంచుకోగా.. ప్రేమ జంట రీతూ చౌదరి, డెమాన్ పవన్, ఫ్లోరా, దివ్య నిఖిత, దమ్ము శ్రీజ ఈ ఐదుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. వీరిలో ఫ్లోరా షైనీ ఫస్ట్ ఎలిమినేషన్‌తో ఇంటి ముఖం పడుతుంది అంటున్నారు. మిగిలిన డెమాన్, రీతూ, శ్రీజ, నిఖిత ఈ నలుగురు మధ్య ఎలిమినేషన్‌కి టఫ్ ఫైట్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదటి ఐదుగురిలో ఖచ్చితంగా సేఫ్ జోన్‌లో ఉంటాడనుకున్న సుమన్ శెట్టి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఫ్లోరాతో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరనేదానికి ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఫ్లోరా సైని, రీతు చౌదరి ఉన్నారు. అయితే వీరిద్దరూ డబుల్ ఎలిమినేషన్ అవుతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కి పవరస్త్ర ఉంది. అది తను వాడితే ఒకరు సేవ్ అవుతారు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ నేటి(ఆదివారం) ఎపిసోడ్ లో జరుగనుంది. వైల్డ్ కార్డ్స్ కి బిగ్ బాస్ అవకాశం ఇచ్చి ఎలిమినేషన్ లో ఉన్న వారిని సేవ్ చేసే ఛాన్స్ ఇస్తాడో చూడాలి మరి. అయితే ఫ్లోరా సైనీ ఫస్ట్ ఎలిమినేషన్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది.