English | Telugu

Bigg Boss 9: పవరస్త్ర పొందిన ఇమ్మాన్యుయల్.. తనూజకి రాకుండా చేసిన భరణి!

బిగ్ బాస్ సీజన్-9 ఐదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఈరోజు(ఆదివారం) పవర్ స్ట్రామ్ రాబోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి అందరు సిద్ధంగా ఉండాలని నాగార్జున కంటెస్టెంట్స్ కి చెప్పాడు. గోల్డెన్ స్టార్ పొందిన ఆరుగురు కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి, దివ్య, తనూజ, రాము రాథోడ్. ఫిష్ బౌల్ నుండి నాగార్జున చీటీ తీస్తాడు. అందులో తనూజ పేరు వస్తుంది. దాంతో తనని యాక్టివిటీ రూమ్ కి పిలుస్తాడు.

అక్కడ అరుగురికి సంబంధించిన కీస్ ఉంటాయి. ఎవరికి పవరస్త్ర రావద్దనుకుంటున్నారో వాళ్ళ 'కీ' విరగొట్టమని తనూజకి నాగార్జున చెప్పాడు. దాంతో రాము 'కీ' తనూజ విరగ్గొడుతుంది. అతను ఒకదానిపై కచ్చితంగా మాట్లాడడు అని రీజన్ చెప్తుంది. తనూజ వెళ్లి దివ్యని పంపిస్తుంది. దివ్య వచ్చి కళ్యాణ్ 'కీ' విరిచేస్తుంది. ఆ తర్వాత భరణి వస్తాడు. అతను తనూజ 'కీ' విరగ్గొడుతాడు. తనూజకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళని మర్చిపోయి వాళ్లకు మళ్ళీ సపోర్ట్ గా ఉండదు. ప్రతీదానికి ఎమోషనల్ అవుతుందని భరణి అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన వచ్చి దివ్య 'కీ' విరగ్గొడుతాడు.

ఇక చివరగా పవన్ కళ్యాణ్ వస్తాడు. అక్కడ భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరి 'కీ' లు మాత్రమే ఉంటాయి. దాంతో భరణి 'కీ' విరగ్గొడుతాడు కళ్యాణ్. చివరగా మిగిలింది ఇమ్మాన్యుయల్ 'కీ'. దాంతో గోల్డెన్ స్టార్ కలిగిన అందరిని యాక్టివిటి రూమ్ కి పిలిచి పవరస్త్రని ఇమ్మాన్యుయల్ గెలుచుకున్నాడని చెప్తాడు. 'కీ' ద్వారా బాక్స్ నుండి పవరస్త్ర తీసుకుంటాడు. ఇది నువ్వు ఎప్పుడైనా ఉపయోగించవచ్చని నాగార్జున చెప్తాడు. గోల్డెన్ స్టార్ తో పాటు పవరస్త్ర పొందిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయల్. హౌస్ లో ఐదో వారం జరిగిన టాస్క్ లలో ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ బెస్ట్ సంచాలక్ గా చేశారు.