English | Telugu
సుడిగాలి సుధీర్‌కు ఊహించని షాక్!
Updated : Dec 29, 2021
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన వ్యక్తి సుడిగాలి సుధీర్. ఈ కామెడీ షోతో పాటు తన టీమ్ తో కలిసి `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో సుడిగాలి సుధీర్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో `స్వర్గంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్` పేరుతో ప్రత్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కి `గులాబీ` ఫేమ్ మహేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి నటి మహేశ్వరిని ఆహ్వానించే ప్రయత్నంలో ఆమెతో చేయి కలిపే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన మహేశ్వరి హాయ్ అనడానికి బదులు నమస్కారం చేసి షాకిచ్చారు. `ఇదేంటి నేను హాయ్ చెప్తే మీరు నమస్కారం పెడుతున్నారు?' అని సుధీర్ ప్రశ్నించగా `వద్దు బాబూ.. `నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోరకలుపుతావ్` అంటూ మహేశ్వరి దిమ్మదిరిగే పంచ్ వేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిసాయి.
Also Read:మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్!
'ముందు దూరంగా వుండూ' అంటూ నటి మహేశ్వరి ఇచ్చిన కౌంటర్ కు సుధీర్‌కు ఫ్యూజులు అవుటయ్యాయి. ఆ తరువాత వేసిన పంచ్ తో ఊహించని షాక్ తగిలింది. 'ఇంతకీ మేడమ్ నన్ను ఎక్కడ వుండమంటారు? అని సుధీర్ అడిగితే.. 'నా నుంచి మాత్రం దూరంగా వుండే'.. అని మహేశ్వరి అనడంతో సుధీర్ షాక్ కొట్టిన కాకిలా మాడిపోయాడు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఈ ప్రోమో ప్రారంభంలో ఇంద్రజ ... అను ఇమ్మానుయేల్ పై వేసిన పంచ్ కూడా బాగానే పేలింది.