English | Telugu
`పెళ్లాం వద్దు పార్టీ ముద్దు`లో వర్మ హంగామా!
Updated : Dec 29, 2021
న్యూ ఇయర్ హంగామా కోసం వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలని సిద్ధం చేశాయి.. ఇందుకు సంబంధించిన ప్రోమోలని వన్ బై వన్ విడుదల చేస్తూ హంగామా సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఈటీవీ నుంచి బయటికి వచ్చిన ఓ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. `ఎక్స్‌ట్రా జబర్దస్త్` కామెడీ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ 31 నైట్ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.
`పెళ్లాం వద్దు పార్టీ ముద్దు` పేరుతో డిజైన్ చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్‌గా వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఆహ్వానించారు. ఇంకే ముంది..షో ఆసాంతం నవ్వులు.. పంచులతో రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన వేసిన పంచ్ లకు కంటెస్టెంట్ లతో పాటు షోకు హోస్ట్ గా వ్యవహరించిన ఇంద్రజ కూడా పడి పడి నవ్వడం విశేషం.
Also Read:బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. శ్రీవల్లి రియాక్షన్ ఏంటీ?
హైపర్ ఆది ఫ్యామిలీ ఎంట్రీతో ఈ ప్రోమో మొదలైంది. ఈ సందర్భంగా హైపర్ ఆది తన తండ్రి రోజు చేసే పనిని ఫన్నీగా చెప్పి నవ్వులు పూయించాడు. ఆ తరువాత వర్మతో కలిసి హైపర్ ఆది చేసిన స్కిట్ కూడా నవ్వులు పూయిస్తోంది. విష్ణు ప్రియను చూపిస్తూ 'ముందు వేరే ఆవిడని చేసుకున్నాను.. అయితే నాకు ఈవిడ నచ్చింది.. నేను ఈవిడ కావాలనుకుంటున్నాను.. ఇది రైటా రాంగా?' అని హైపర్ ఆది .. వర్మని అడగడం...'మీరు తనని పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా..? అప్పుడు మీరు నాతో తిరగండ'ని మరో యువతికి చెప్పడం... ఇంతలో ఆటో రాంప్రసాద్ వచ్చి 'బ్రదర్ ఎవరావిడ కత్తిలా వుంద'నడం... 'నువ్వు అలా అంటే నేను మీ ఆవిడని అంటానని అనుకుంటున్నావ్ అబ్బా.. నేను అస్సలు అనను' అని పంచ్ వేయడం... షోలో నవ్వులు కురిపించింది. వర్మ సైలెంట్ పంచ్ లతో నవ్వులు పూయించిన ఈ షో 31 రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కాబోతోంది.