మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్!
on Dec 29, 2021

భారత్ లో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిసెంబర్ 31 న విడుదల కావాల్సిన హిందీ జెర్సీ వాయిదా పడింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది. తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడ్డాడు.
తాజాగా సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ తనకు కరోనా సోకినట్టు తెలిపాడు. “ నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారం రోజులుగా కలిసిన నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను క్షేమంగా ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు.” అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

మనోజ్ ట్వీట్ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లుకోరుకుంటున్నారు. కాగా మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



