English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 లోకి బ్యాంకాక్ పిల్ల ఎంట్రీ ఇవ్వనుందా!

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ గురించి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో తాజాగా 'బ్యాంకాక్ పిల్ల' అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. యూట్యూబ్ లోని బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తను అందరికి సుపరిచితమే. తను అప్లోడ్ చేసే వీడియోలు దాదాపు వైరల్ అవుతుంటాయి.

బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన లోగో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. సెట్ పనులు కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చిందంటూ వార్తలు నెట్టింట జోరుగా కొనసాగుతున్నాయి. అందులో కామెడీ షో నుండి ఒకరు, యాంకర్ నుండి మరొకరు, కామన్ మ్యాన్ కేటగిరీ నుండి ఈ సారి ముగ్గురు లేదా నలుగురిని తీసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో 'బ్యాంకాక్ పిల్ల' వెళ్తుందని తెలుస్తోంది. బ్యాంకాక్ పిల్ల పూర్తి పేరు శ్రావణి సమంతపూడి. తన కుటుంబంతో కలిసి శ్రావణి బ్యాంకాక్ లో ఉంటుంది. 'బ్యాంకాక్ పిల్ల' పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.

బ్యాంకాక్ లో తను ఉండే ఇంటిని, చుట్టుపక్కల టూరిస్ట్ ప్రదేశాలని, టెంపుల్స్ ని చూపిస్తూ వ్లాగ్ లు చేసి బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే మూడు రోజుల క్రితం 'ఇండియాకి వచ్చేశాం' అంటూ తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ కింద ఆల్ ది బెస్ట్ ఫర్ బిబి-7 అంటూ తెగ కామెంట్స్ రావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్తుందేమోనని అందరిలో సందేహం మొదలైంది‌. దీంతో తనే స్వయంగా మరొక వీడియోని చేసింది బ్యాంకాక్ పిల్ల. 'నేను బిగ్ బాస్ కి.. బిగ్ బాస్ ఎంట్రీ‌‌.. మై ఫ్యామిలీ రియాక్షన్స్' అంటూ ఒక వ్లాగ్ ని చేసింది. అందులో తన గురించి బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్లు యూట్యూబ్ లలో వస్తున్నటువంటి వాటిని చూపిస్తూ.‌. వీటిని ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. నాకైతే బిగ్ బాస్ నుండి ఏ పిలుపు రాలేదు. ఒకవేళ బిగ్ బాస్ లో అవకాశం వస్తే, పిల్లలతో కలిసి వెళ్తానని, పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్ళనని బ్యాంకాక్ పిల్ల ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.