English | Telugu

నువ్వు లైఫ్ ఇస్తే అభి అన్న ఇచ్చిందేంటి కత్రినా కైఫా!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షోలో ఆది అందరినీ చెడుగుడు ఆడేసుకున్నాడు. అందులో రష్మీ, జబర్దస్త్ కమెడియన్ ఫణి మీద కౌంటర్ లు వేసేశాడు. ఈ వారం బోనాల స్పెషల్ థీమ్ ఈ షోని తీసుకువచ్చారు మేకర్స్. ఐతే స్టార్టింగ్ లో రచ్చ రవి వచ్చి "బోనాల పండగ సీజన్ కాబట్టి డిజె టిల్లు అదరగొడతాం" అనే గట్టిగా చెప్పేసరికి "డిజె టిల్లు నువ్వు చెప్పేది సొల్లు, నువ్వు ఇంటికెళ్ళు" అని కౌంటర్ వేసాడు నూకరాజు. దానికి రష్మీ మధ్యలోకి వచ్చేసింది "బోనాల పండగ అంటే డిజెయింగ్ కాకుండా..కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు చాలా ఉంటాయి మాటిమాటికి డీజే, డీజే, డీజే అంటే కుదరదు" అంది. "అవును నువ్వు అలా డీజే అని అంటే ఎలా ఇప్పుడు రష్మీ ఢీ షో చెయ్యట్లేదు కదా" అని మరో కౌంటర్ వేసాడు హైపర్ ఆది. తర్వాత ఇక్కడికి వచ్చిన టీమ్స్ తో కనకవ్వ కలిసి "నర్సపెల్లె" అనే జానపద పాటకు డాన్స్ చేసింది. ఐతే ఇంద్రజ సెపరేట్ గా ఆమెను డాన్స్ చేయమని అడిగేసరికి ఆమెతో కలిసి రష్మీ కూడా డాన్స్ చేసింది. "కనకవ్వ కంటే ఈ అవ్వే బాగా చేసింది" అని హైపర్ ఆది కామెంట్ చేసాడు. దానికి రష్మీ షాకైపోయింది.

తర్వాత ధరణి బ్యాచ్ అని డీజే టిల్లు బ్యాచ్ అంటూ టు టీమ్స్ గా డివైడ్ చేశారు ఆది. ధరణి బ్యాచ్ లో జబర్దస్త్ కమెడియన్ ఫణి ఆదిని చూసి "తమ్ముడు" అని పిలిచేసరికి "దూరంగా ఉండు కొంచెం..నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది" అన్నాడు ఆది. "అభి అన్న టీమ్ లో నువ్వొక్కడివే గుండుగుత్తుగా డైలాగ్స్ చెపేవాడివి గుర్తుందా.. ఈరోజు నీకు ఒక్క డైలాగ్ ఇస్తే ఒట్టు" అన్నాడు .."అదేంట్రా నేను నీకు లైఫ్ ఇచ్చాను కదా" అని ఫణి అనేసరికి "నువ్వు లైఫ్ ఇస్తే అభి అన్నా ఇచ్చిందేంటి కత్రినా కైఫా" అన్నాడు ఆది.."సర్లే కానీ వెళ్లి ఒక టీ తీసుకురా" అని ఫణికి ఆర్డర్ వేసేసరికి "నేనా నీకు టీ తీసుకురావాలా" అనేసరికి "అభి అన్న టీమ్ లో నువ్వు నాతో ఎన్ని సార్లు టీ తీసుకొచ్చి ఉంటాను" అన్నాడు ఆది . "ఇంకా గుర్తుపెట్టుకున్నావా" అనేసరికి "నేను డైలాగ్స్ మర్చిపోను ఇది ఎలా మర్చిపోతాను" అన్నాడు. తర్వాత ఆది ఫణి గురించి చెప్పాడు. "నాకు అభి అన్న టీంలో నాకంటూ ఒక పేరు వచ్చిందంటే దానికి కారణం ఫణి అన్నే ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్స్ పేలేవి కావు నేను చెప్పే డైలాగ్స్ పేలేవి" అన్నాడు ఆది. "నిజం చెప్తున్నా నువ్వు ఈ రేంజ్ వస్తావని కల్లో కూడా అనుకోలేదు" అని ఆది గురించి ఫణి చెప్పేసరికి "కానీ నువ్వు ఈ రేంజ్ కి వస్తావని నేను అనుకున్నా" అని ఫణి పరువు తీసేసాడు ఆది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.