Read more!

English | Telugu

హాస్పిటల్ లో ముక్కు అవినాష్ వాళ్ళ అమ్మ!

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.

ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. కాగా తాజాగా అవినాష్  వాళ్ళ అమ్మకి బాగోలేదంటూ చెప్పాడు.

ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా 'అమ్మకి ఇలా అవుతుందని అనుకోలేదు' అనే టైటిల్ తో ముక్కు అవినాష్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. దాంతో ఈ వీడియోకి అత్యధిక సంఖ్యలో ‌వ్యూస్ వస్తున్నాయి. ముక్కు అవినాష్ వాళ్ళ అమ్మకి గుండె నొప్పి రావడంతో వాళ్ళ ఇంట్లోవాళ్ళు రాత్రికి రాత్రే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. టెస్ట్ లు చేసిన వైద్యులు అత్యవసరంగా గుండెకి స్టెంట్ వేశారట. అయితే ఆపరేషన్ తర్వాత వాళ్ళ అమ్మను ముక్కు అవినాష్ మాట్లాడించగా, అవినాష్ ని పట్టుకొని వాళ్ళ అమ్మ ఏడ్చేసింది. ఇలా వాళ్ళ అమ్మని ఆ టైంలో హాస్పిటల్ కి తీసుకొచ్చినందుకు వాళ్ళ అన్నకి,  తనని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి  థాంక్స్ చెప్పాడు అవినాష్. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.