English | Telugu

ఓట్ ఫర్ మీ లో యావర్.. కన్నింగ్ అర్జున్ మద్దతుతో శోభాకి ఛాన్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో పద్నాలుగవ వారం నామినేషన్ లతో హౌస్ అంతా హీటెక్కింది. పల్లవి ప్రశాంత్ మరియు అమర దీప్ ల మధ్య తగ్గేదేలే అన్న రేంజ్ లో రివేంజ్ నామినేషన్ జరిగింది. ఇక హౌస్ లో ఉన్న ఏడుగురిలో ఇప్పటికే అంబటి అర్జున్ ఫైనల్ కి చేరుకున్నాడు. మరోవైపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలనుకుంటే ఈ రెండు వారాలపాటు ప్రేక్షకుల ఓట్లే కీలకం అంటూ మెలిక పెట్టాడు. దీంతో హౌస్ మేట్స్ ఫన్ గేమ్ లని సైతం సీరియస్ గా తీసుకొని ఆడుతున్నారు.

అమర్ దీప్ నామమాత్రపు కెప్టెన్ గా ఉండి హౌస్ మేట్స్ పై పెత్తనం చెలాయించాలని .. నేను కెప్టెన్ ని, నేను చెప్తే వినాలి అంతే అన్నట్టు ప్రశాంత్ తో ప్రతీసారీ వాగ్వాదానికి దిగుతున్నాడు. ఇది ప్రేక్షకులు అందరు చూస్తున్నారు. ఇక హౌస్ లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ లు చేసే చిల్లర గొడవలకి బిగ్ బాస్ ఫుటేజ్ ఇస్తున్నాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ ల ఫుటేజ్ తగ్గించి ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటికే సగం వారం పూర్తయింది. హౌస్ మేట్స్ కోసం మొదటగా స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ప్రాపర్టీ తీసుకొని బజర్ మోగగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. ఎవరైతే చివరగా దూకుతురో వారు గేమ్ నుండి తప్పుకుంటారనే రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో మొదట అమర్ దీప్ అవుట్ అయి‌ రేస్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక అవుట్ అవ్వగా..‌చివరగా యావర్, శివాజీ ఉన్నారు. ఇక ఒక్క సెకండ్ తేడాతో యావర్ గెలిచి విన్నర్ గా, శివాజీ రన్నర్ గా నిలిచారు. యావర్ ఈ టాస్క్ గెలిచి 'ఓట్ అప్పీల్' చేసుకోవడానికి అర్హత సాధించాడు.

ఇక సెకండ్ టాస్క్.. రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ఉంటాయి.. అందరు బిగ్ బాస్ ఒక కలర్ చెప్పినప్పుడు ఆ కలర్ ఉన్న వరుసలో జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే తప్పు వరుసలో అడుగుపెడతారో వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. ‌ఇందులో వరుసగా‌ అర్జున్, యావర్, ప్రశాంత్, అమర్, ప్రియాంక అవుట్ అవ్వగా.. శివాజీ, శోభాశెట్టి మిగిలారు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ లో శివాజీ బ్యాలెన్స్ మిస్ అయి వరుసలో నుండి బయటకు వచ్చాడు. శోభాశెట్టి గెలిచింది. ఓటు అప్పీల్ కోసం యావర్, శోభాశెట్టి మిగిలారు. వీరిలో ఎవరు ప్రేక్షకులకు ఓటు అప్పీలు చేసుకోవాలో హౌస్ మేట్స్ ని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. ఇక అంబటి అర్జున్ మొదటగానే శోభాశెట్టికి తన మద్దతుని ఇచ్చాడు‌. అంటే యావర్ గేమ్స్ బాగా ఆడతాడు. తనకి ప్రేక్షకుల సపోర్ట్ ఉంది‌ ఒకవేళ నామినేషన్ లో ఉన్నా తనతో ఫ్యాన్స్ ఉంటారు. కానీ శోభాశెట్టి బాటమ్ లో ఉంది. కాబట్టి తనకి ఓటు అప్పీల్ అవసరమని చెప్పి రేస్ నుండి యావర్ ని తప్పించాడు అర్జున్. దీంతో అర్జున్ కన్నింగ్ మైండ్ గేమ్ బయటపడింది. యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడు బయటకు వెళ్తే టాస్క్ లలో అర్జున్ ని ఎవరు డిఫెండ్ చేయలేరని, విన్ అవ్వొచ్చని భావించి తన సపోర్ట్ శోభాశెట్టికి ఇచ్చాడు కన్నింగ్ అర్జున్. ఇక ప్రియంక, అమర్ కలిసి తమ మద్దతుని శోభాశెట్టికి ఇచ్చారు. పల్లవి ప్రశాంత్, శివాజీ కలిసి వారి మద్దతుని యావర్ కి వేసారు. కానీ అత్యధిక సపోర్ట్ శోభాశెట్టికి రావడంతో తనే ఓటు అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత ఓటు అప్పీల్ ని రిక్వెస్ట్ చేసింది శోభాశెట్టి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..