English | Telugu

ఆంటీ అన్న అవినాష్...షాకైన శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ కలర్ ఫుల్ గా రాబోతోంది. హాట్ హాట్ గా ఉన్న అత్తలు..కూల్ గా ఉన్న సీరియల్ కోడళ్ళు వచ్చారు. శ్రీముఖి కూడా వాళ్ళతో కలిసి బాగా ఎంటర్టైన్ చేసింది. అవినాష్ కి ఫైమా భార్యగా నటించింది. శ్రీముఖిని చూసి ఎవరా ఆంటీ అని అడిగేసరికి శ్రీముఖి నోరెళ్లబెట్టింది. అవినాష్ పెదరాయుడు గెటప్ లో ఊళ్ళో సమస్యలు తీర్చడానికి వచ్చేసరికి వెనకాలే ఫైమా వచ్చి "ఇంట్లో సమస్యలు తీర్చలేవు గాని ఊళ్ళో సమస్యలు తీరుస్తావా..ఇంటికొచ్చి కూరలు కొయ్యి ముందు" అని అవినాష్ చెంపలు వాయగొట్టింది. జానకి కలగనలేదు...సీరియల్ నుంచి అత్త రాశి డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అవినాష్ తెగ పొగిడేసాడు..రాశిని అత్త అంటే ఊరుకోను అన్నాడు.

ఇక ఈ షోకి వచ్చిన అత్తా కోడళ్ళు అస్సలు మాట్లాడకుండా పోట్లాడుకోకుండా సైలెంట్ గా ఉన్నారు. దాంతో ఫైమా ఏంటి అందరూ ఇంత సప్పగా ఉన్నారు...అత్తాకోడళ్లు తిట్టుకుంటే ఇక్కడున్నవాళ్లంతా పారిపోవాలి అలా తిట్టుకోవాలి అంది..ఎలా తిట్టుకోవాలో, ఎలా పోట్లాడుకోవాలో కూడా ఫైమా, అవినాష్ చేసి చూపించారు. వర్షం మూవీలో సాంగ్ కి రాశి డాన్స్ అదరగొట్టింది. తర్వాత లేడీస్ అందరికి జడలు వేసుకునే పోటీ పెట్టింది. ఇక ఫైనల్ లో వచ్చిన మేజిక్ షోని ఒక రేంజ్ లో ఈలలు, కేకలతో ఫుల్ ఎంజాయ్ చేశారు "అన్ స్టాపబుల్ అత్తలు, ఖతర్నాక్ కోడళ్ళు"..ఇక ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ వేరేలేవేల్ లో ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మాత్రం రాశి గారి కోసం చూడాలి అనిపిస్తుంది...ఏమాటకామాట కోడళ్ళకంటే అత్తలే కాస్త హుషారుగా, అందంగా కనిపిస్తున్నారు కదండి" అని అంటున్నారు. ఇందులో "జానకి కలగనలేదు" సీరియల్ నుంచి అమరదీప్ చౌదరి వచ్చాడు. ఈ సీరియల్ లో అత్తగా నటించిన రాశికి, కోడలిగా నడిచిన ప్రియాంక మధ్యలో బత్తాయి జ్యూస్ తీసే పోటీ పెట్టింది శ్రీముఖి. అమరదీప్ తన తల్లి, భార్యను ఇద్దరినీ బాలన్స్ చేస్తూ దగ్గరుండి హెల్ప్ చేసాడు. "కొడుకు ఎక్కువ ఇష్టమా, కోడలా" అని శ్రీముఖి రాశిని అడిగేసరికి "కొడుకు చేసుకున్నాడు కాబట్టి కోడలంటే ఇష్టం" అని చెప్పింది రాశి.