English | Telugu
జంటల మధ్య మొదలైన మార్కుల యుద్ధం..సర్దిచెప్పిన రాధ, శ్రీముఖి
Updated : Jun 30, 2023
"నీతోనే డాన్స్" ఈ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే షో ప్రోమోలో జంటల మధ్య మార్క్స్ వార్ మొదలైపోయింది. ఈ రాబోయే వారం థీమ్ "డాన్సస్ ఆఫ్ ఇండియా" పేరుతో అందరూ రకరకాల డాన్స్ స్టైల్స్ తో, వాటికి సరిపోయే వెరైటీ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. ఐతే ఒక్కొక్కళ్ళ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా చేసారు. ఇక ఇక్కడినుంచే వార్ మొదలయ్యింది..యాదమ్మ రాజు, స్టెల్లా చేసిన డాన్స్ మీద అంజలి - పవన్ జంట కామెంట్ చేశారు. "అరే నెక్స్ట్ టైం మ్యాజిక్ తో పాటు ఇంకొంచెం డాన్స్ చేయండి..ప్రాపర్టీ తప్ప డాన్స్ కనిపించడం లేదు" అనేసరికి శ్రీముఖి ఆ రెండు జంటల మధ్య సర్ది చెప్పి కూల్ చేసింది.
సాగర్- దీప చేసిన డాన్స్ లో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. ఈ జంటకి శివ్-ప్రియాంక జైన్ 5 మార్క్స్ ఇవ్వగా, ఆట సందీప్ - జ్యోతి జోడి 8 మార్క్స్ ఇచ్చారు. దీని మీద వాళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగిపోయింది. "లాస్ట్ టైం నా కాస్ట్యూమ్ బాగాలేదని ఆట సందీప్ రెండు మార్కులు కట్ చేసేసారు..మార్క్స్ విషయంలో చాలా అన్ ఫెయిర్ గా నడుస్తోంది" అని శివ్ మండిపడ్డాడు..దానికి ఆట సందీప్ కౌంటర్ ఇచ్చాడు. " అన్ ఫెయిర్ అని నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావ్..నువ్వు జడ్జి చేయొద్దు" అన్నారు..దానికి శివ్ "లాస్ట్ టైం సాగర్ మాకు 6 మార్క్స్ ఇచ్చినప్పుడు ఆట సందీప్ కూడా 6 మార్క్స్ ఇచ్చారు" అనేసరికి వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అది చూసిన జడ్జి రాధ "ఒక్క నిమిషం ...యుద్ధంలో అన్ని ఫెయిర్ గానే ఉంటాయి" అని చెప్పారు. ఇక నటరాజ్ మాష్టర్ లేడీ గెటప్ లో వచ్చి చేసిన డాన్స్ కి తరుణ్ మాష్టర్ లేచి యోగిని కాస్తా భోగిని అయ్యాను అంటూ కామెంట్ చేసేసరికి అందరూ నవ్వేశారు. లాస్ట్ లో అంజలి-పవన్ జంట డాన్స్ చేస్తూనే మధ్యలో ఆపేసి ఏడవడం స్టార్ట్ చేశారు. దాంతో అసలు ఏం అయ్యిందో అర్థంకాక అందరూ షాకయ్యారు.