English | Telugu
సెప్టెంబర్ 11 నుంచి మామగారు కొత్త సీరియల్
Updated : Sep 2, 2023
బుల్లితెర సీరియల్స్ చూసేవాళ్లకు ఇక పండగే పండగ. ఒక పక్కన బిగ్ బాస్ మరో వైపు మామగారు కొత్త సీరియల్ ఎంట్రీ.. ఇక వీక్ మొత్తం సందడే సందడి. 'స్టార్ మా' లో ఇప్పుడు మరో ధారావాహిక 'మామగారు' రాబోతోంది . దేవత సీరియల్ ఫేమ్ సుహాసిని ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. 'దేవత' సీరియల్ లో సుహాసిని పండించిన ఎమోషన్ సీన్స్ అప్పట్లో పెద్ద హిట్. ఇప్పుడు ఈ సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరించబోతోంది.
ఈ సీరియల్ సెప్టెంబర్ 11 నుంచి సాయంత్రం 6 .30 కి ప్రసారం కాబోతోంది. ఇంట్లో ఆడవాళ్లు , ఇంటికొచ్చే కోడళ్ళు ఇంటి పనులే చేయాలి కానీ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ మామగారు కండిషన్స్ పెడతారు. అలాంటి మావయ్యను కొత్త కోడలు సుహాసిని ఎలా మారుస్తుంది అనేదే ఈ సీరియల్ కథ. చూడబోతే ఈ సీరియల్ కూడా 'దేవత'సీరియల్ లానే ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంటుతో నిండినట్టు కనిపిస్తుంది. సుహాసిని లక్ష్మీ కళ్యాణం, అడ్డా, దోస్త్ వంటి 30 మూవీస్ లో నటించింది. ఈమె తమిళం, కన్నడంలోనూ నటించింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో బుల్లితెర మీదకు వచ్చింది. తర్వాత వరసగా సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో నటించింది. అలాంటి సుహాసిని ఈ సీరియల్ లో కూడా విపరీతంగా ఎమోషన్ పండించేస్తుందా లేదా కొంచెం కామెడీ యాంగిల్ లో ఎమన్నా ట్రై చేసిందా అనేది చూడాలి.