English | Telugu

నైట్ వెళ్ళేటప్పుడు ఈ రెడ్ డ్రెస్ వేసుకెళ్తే కష్టం..నా రోల్ పేరు దుర్యోధన అని చెప్పిన రఘు

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి ఈ వారం "హిడింబా" మూవీ టీమ్ వచ్చేసింది. ఈ షోకి అశ్విన్ బాబు, రఘు కుంచె, డైరెక్టర్ అనిల్ కృష్ణ, సాహితి వచ్చారు.."హిడింబా అనగానే ఎందుకు మీరు అశ్విన్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు" అని శ్రీముఖి అడిగింది. "కటౌట్ చూసారు కదా. చెప్పాలంటే ఈ మూవీ అందరికీ ఛాలెంజింగ్ . టెక్నిషన్స్ కి, ఆర్టిస్ట్స్ కి ఈ మూవీ ఒక ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకు అన్నమాటే మూవీ చూసాకే అర్ధమవుతుంది" అని చెప్పారు అనిల్ కృష్ణ. ఇక మూవీలో నందిత శ్వేతా ఉన్నారు ఇక ఇప్పుడు ఈ స్టేజి మీదకు మరో రోల్ లో నటించిన సాహితి వచ్చారు.."మరి సాహితి మీకు ఈ మూవీలో చేయడం ఎలా అనిపించింది అని అడిగింది.

"అందరికీ బోనాల శుభాకాంక్షలు...మూవీ చేసింది కొద్ది రోజులే ఐనా అందరితో నా జర్నీ చాలా బాగా జరిగింది." అని చెప్పింది. "ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే పరిచయం కానీ మూవీలో మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంట" అని శ్రీముఖి రఘు కుంచెని అడిగేసరికి "ఏదోలేబ్బా జీవితంలో అప్పుడప్పుడు కొంచెం మార్పు ఉండాలి కదా అన్నాడు. నా రోల్ గురించి నేను లీక్ చేయకూడదు...కానీ నా రోల్ పేరు దుర్యోధన" అని చెప్పారు. ఇక ఎవరో గిఫ్ట్ బాక్స్ పంపించారంటూ హరి ఒక రెడ్ బాక్స్ ని శ్రీముఖి దగ్గరకు తీసుకొచ్చేసరికి అది రెడ్ బాక్స్ జాగ్రత్త అని కస్తూరి చెప్పడంతో శ్రీముఖి భయపడింది. "నువ్వు రెడ్ వేసుకుంటే వేసుకున్నావ్ కానీ నైట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రెడ్ ఓణీ వేసుకెళ్తే నేనేం చేయలేను" అన్నాడు అశ్విన్. "మరి మీ హీరోయిన్ కూడా రెడ్ డ్రెస్ వేసుకొచ్చిందిగా" అంది శ్రీముఖి. "తనను కాపాడడానికి నేను ఉన్నా కదా" అన్నాడు అశ్విన్. ఇక గిఫ్ట్ బాక్స్ లో మేక కొమ్ములతో ఉన్న ప్లాస్టిక్ మాస్క్ ని బయటికి తీస్తుంది. అది చూసిన అశ్విన్ మూవీలో ఈ మాస్క్ చాటు ఉన్న మనిషిని పట్టుకోవడమే స్టోరీ అని చెప్పారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.