Read more!

English | Telugu

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ ఎవరో తెలుసా?


బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత అంతా కొత్త హౌజ్ మేట్స్ అయినటువంటి పోటుగాళ్ళ మీదే ఉంది. నయని పావని, అంబటి అర్జున్, పూజా మూర్తి,  భోలే శావలి, అశ్విని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కృష్ణ కూడా పోటుగాళ్ళ టీమ్ లోనే ఉన్నాడు.

సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది‌.‌ మంగళవారం నుండి ఆటగాళ్లు-పోటుగాళ్ల మధ్య టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో పోటుగాళ్ళ టీమ్ రెండు టాస్క్ లో గెలిచి ఆధిక్యంలో ఉండగా.. ఈ పోటుగాళ్ళ టీమ్ లో అంబటి అర్జున్ టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. అయితే ఈ టీమ్ లోని అశ్విని శ్రీ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అశ్విని శ్రీ తెలుగమ్మాయి. 1989  జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌.

అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 356K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. దీంతో తను నామినేషన్లో ఉన్నా ఈజీగా సేఫ్ అవుతుంది.  బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారంటే ఏ కంటెస్టెంట్ ఎక్కువ వారాలు ఉండరు. ఎందుకంటే హౌజ్ లో అప్పటికే ఉన్నవారితో అంత బాండింగ్ ఉండదు. మొన్న జరిగిన నామినేషన్లో సీరియల్ బ్యాచ్ శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి అశ్విని శ్రీని నామినేట్ చేయడంతో తను ఏడ్చేసింది. ఇక ఆ సీరియల్ గ్రూప్ చేసే పాలిటిక్స్ వల్ల తను మునుముందు హౌజ్ లో ఎలా ఉండగలదో, వాళ్ళని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే అశ్విని శ్రీ.. టాప్-5 లో ఉంటుందా తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.