English | Telugu
రతికతో ఒక రోజు... మెసేజ్ చేయాల్సిందే!
Updated : Oct 11, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. హౌజ్ లో రోజుకొక కొత్త టాస్క్ లతో క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే హౌజ్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో అయిదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతికరోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళ అయిదుగురిలో అత్యధిక క్రేజ్ సంపాదించుకుంది మాత్రం రతికరోజ్.
రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు 'బేబీ' సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం రతిక బయటకొచ్చేస్తుందని అనగా సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయింది. ఎలిమినేట్ అయి బయటకొచ్చేముందు కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో అసలు మాట్లాడలేదు, అసలు చూడను కూడా చూడలేదు రతిక. దాంతో సీరియల్ బ్యాచ్ ఇంపాక్ట్ రతిక మీద ఏ రెంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక హౌజ్ లో తన గ్లామర్ కి ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారు.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక రతిక బిగ్ బాస్ లైవ్ చూస్తుంది. అయితే హౌజ్ లో రతిక గురించి ఇప్పుడు పెద్దగా ఎవరు ప్రస్తావించట్లేదనే చెప్పాలి. ఎందుకంటే కొత్త కంటెస్టెంట్స్ లలో నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి, అంబటి అర్జున్, భోలే శావలి చేసే హడావిడి ముందు రతిక పేరు వినపడట్లేదు. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ మీట్ పెడదామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసెజ్ చేయడంటూ ఒక నోట్ ని పోస్ట్ చేసింది రతిక. దీంతో తనకి పాజిటివ్ కామెంట్లతో పాటుగా నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ మోహం పెట్టుకొని కలుస్తావంటూ ఒకతను కామెంట్ చేయగా, ఆడుకున్నది చాలదా అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు అయితే నేను రెడీ అని, నిజమేనా అని మరొకరు ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇక మరొక అభిమాని తన కోసం మాత్రమే బిగ్ బాస్ చూస్తున్నాని పోస్ట్ పెట్టగా అది తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది రతిక. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.