English | Telugu
బిగ్ బాస్ ఓటీటీలో అంతా సెకండ్ హ్యాండ్ వాళ్లే!
Updated : Feb 22, 2022
బిగ్ బాస్ సీజన్ మళ్లీ మొదలు కాబోతోంది. అయితే ఈసారి ఓటీటీ ఫార్మాట్ ని కూడా స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 24 గంటలసేపు నిరంతరాయంగా స్ట్రీమింగ్ కానున్న ఈ రియాలిటీ షో ఈ నెల 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ లకు సంబంధించిన లిస్ట్ బయటికి వచ్చేసింది. అయితే ఈ లిస్ట్ పై సింగర్ గీతా మాధురి సెటైర్లు వేసింది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయకుండా అంతా సెకండ్ హ్యాండ్ వాళ్లనే మళ్లీ రంగంలోకి దింపేస్తున్నారని విమర్శలు చేసింది.
Also Read:'దృశ్యమ్ 2' షూటింగ్ మొదలుపెట్టిన అజయ్ దేవ్‌గణ్, శ్రియ
"బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. ఈ సారి నాకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోయాను. నా కెరీర్ తో ఫ్యామిలీని చూసుకోవాలి. పైగా నాకు ఓ బేబీ వుంది. ఇవన్నీ చూసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను షోలో రన్నర్ ని అయ్యాను. రెండో సారి వెళ్తే కప్పు వచ్చేస్తుందని అనుకోలేం. ఏమీ రాదు. ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్ అయిపోయా. బిగ్ బాస్ కి సెకండ్ టైమ్ వెళితే సెకండ్ హ్యాండ్. థర్డ్ టైమ్ వెళితే థర్డ్ హ్యాండ్. ఎప్పుడైనా ఫ్రెష్ టాలెంట్ కే కప్పు వస్తుంది. ఇప్పుడు అంతా సెకండ్ హ్యాండ్ వాళ్లే ఉంటే కాంపిటేషన్ ఉండేదేమో కానీ కొత్త వాళ్లని మిక్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్లలో పాతవాళ్లని విన్ చేస్తే కొత్త వాళ్లకి అన్యాయం చేసినట్టు అవుతుంది.
Also Read:కుమార్తె చేతుల్లో కన్నుమూసిన బప్పీలహిరి
మాజీ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే వాళ్లకి నా సలహా ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడాలి. మిమ్మల్ని కెమెరాలు ఫోకస్ చేస్తుంటాయని గమనించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ నోరు జారకూడదు. సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో చూశాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎమోషన్స్ తోనే ఉండాలి. అక్కడ ఎక్కువ యాక్ట్ చేయలేం. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా వుండాలి. నువ్వు నువ్వుగా ఆడితేనే జనానికి నచ్చుతుంది"అని గీతా మాధురి బిగ్ బాస్ ఓటీటీపై కామెంట్ చేసింది.