English | Telugu
అనుని కిడ్నాప్ చేసిన ఆర్యవర్ధన్!
Updated : Feb 3, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. జీ తెలుగులో గత కొంత కాలంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ చిత్ర విచిత్రమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ మరింత ట్విస్ట్ లతో సాగబోతోంది . ఈ రోజు ఎపిసోడ్‌హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. యాక్సిడెంట్ నుంచి అను తల్లిదండ్రులు రాగసుధని కాపాడి తమ ఇంటిలో ఆశ్రయం కల్పిస్తారు. ఆ తరువాత తమ వద్దే వుండమని తాము నడుపుతున్న టిఫిన్ సెంటర్ బాధ్యతలు అప్పగిస్తారు. ఇదే క్రమంలో రాగసుధ .. ఆర్య వర్ధన్ ని హత్య చేసినట్టుగా ఊహించుకుంటుంది.
Also Read:ఆర్యవర్ధన్ అసలు రంగు అనుకి తెలియనుందా?
రాగసుధ టిఫిన్ సెంటర్ లో వుండగా ఓ పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. అందులోంచి దిగిన పోలీసుల టిఫిన్ చేస్తుంటారు.. ఇదే అదునుగా వ్యాన్ లో వున్న గన్ ని తీసుకున్న రాగసుధ వెంటనే ఆర్యవర్ధన్ ఇంటికి వెళుతుంది. కానీ తనని సెక్యూరిటీ గార్డు లోనికి అనుమతించడు..లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. ఇంటి బయటే వుండి ఆర్యవర్ధన్ కోసం వేచి చూస్తున్న రాగసుధ పేపర్ చదువుకుంటూ ఆర్య వస్తుండటం గమనించి అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరుపుతుంది.. కట్ చేస్తే ఇది నిజం కాదు.. రాగసుధ కల కంటుంది... వెంటనే కంగారుపడుతున్న రాగసుధని అను తల్లిదండ్రులు ఏం జరిగిందని అడుగుతారు. ఏంలేదని, తనకు వచ్చింది కల అని తేరుకుంటుంది.
అయితే ఆ తరువాత రాగసుధ నిజంగానే ఆర్యవర్ధన్ ని చంపడానికి బయలుదేరుతుంది. ఆర్య వాళ్ల ఇంట్లో మాన్సీ `మన ఆఫీసులో ఏదో జరుగుతోంది. కానీ ఎవరికీ తెలియడం లేదు` అని ఆర్యతో అంటుంది. అయితే అది నీకు అనవసరం అని అంటాడు ఆర్య. ఇంతలో రాగసుధ .. ఆర్య ఇంట్లోకే ఎంటరవుతుంది. గదులన్నీ వెతకడం మొదలుపెడుతుంది.. కానీ అదే సమయానికి ఆర్య, అను కలిసి కార్ లో బయటికి వెళతారు. ఆ తరువాత కొంత సేపటికే అనుని కిడ్నాప్ చేస్తున్నానని షాకిస్తాడు ఆర్య.. అయితే ఆర్య నిజంగానే అనుని కిడ్నాప్ చేశాడా? అసలు ఆర్య ప్లాన్ ఏంటీ? ... జరుగుతున్న విషయాలన్నీ అనుకు తెలియకూడదని ఆర్య తల్లి ఎందుకు చెప్పింది? . ఆమె కూడా కుట్రలో భాగమైపోయిందా? అన్నది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.