English | Telugu
ప్రభుదేవా తండ్రి నటి సుధని అవమానించారా?
Updated : Feb 3, 2022
ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా ఎంత ఫేమస్ అన్నది అందరికి తెలిసిందే. అయితే అలాంటి ఆయన తనని అవమానించారని సీనియర్ నటి నటి సుధ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాపులర్ కొరియోగ్రాఫర్ గాఅనేక చిత్రాలకు పని చేశారాయన. దక్షిణాదిలో దాదాపు 1200 పై చిలుకు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తెలుగు, తమిళ భాషల్లో వున్న టాప్ సీనియర్ హీరోలందరితోనూ వర్క్ చేశారు.
అయితే అలాంటి ఫేమస్ కొరియోగ్రాఫర్ తనని దారుణంగా అవమానించారని, అనకూడని మాటలు తనని అన్నారని సీనియర్ నటి సుధ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే... ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి సుధని ఇండస్ట్రీలో మీకు జరిగిన అవమానం గురించి చెప్పమని అడిగితే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు నటి సుధ. `కొన్నేళ్ల క్రితం తమిళంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. సుందరం మాస్టర్ నాకు ఒక చిన్న డ్యాన్స్ మూవ్‌మెంట్ చెప్పారు. నాకెందుకో ఆ మూవ్‌మెంట్ రావడం లేదు.. నాలుగైదు టేకులు అయిన తరువాత `ఛీ నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికి రావు' అని సుందరం మాస్టర్ అరిచేశారు.
Also Read:యష్.. వేదల పెళ్లికి మాళవిక అడ్డుపడుతుందా?
ప్రభుగారు, పి. వాసుగారు ఇలా పెద్ద పెద్ద వాళ్లంతా సెట్ లో వున్నారు. అందరి ముందు నన్ను అంత పెద్ద మాట అనేసరికి తట్టుకోలేకపోయాను. ఏడుస్తూ సెట్ లో నుంచి వెళ్లిపోయాను. ఆయన ఆ సినిమాలో వుంటే నేను చేయనని మా అమ్మతో చెప్పాను. కానీ మా అమ్మ 'నువ్వు చేయ్యాలి' అన్నారు. 'రేపు ఆయన డైరెక్టర్ అవుతారు.. ఆ సినిమాకి నిన్ను అడుగుతారు.. అప్పుడు నీ నటనతోనే సమాధానం చెప్పు' అంది.
మా అమ్మ అన్నట్టే సరిగ్గా అర్నెళ్ల తరువాత ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమాలో అమ్మ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడు అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి.ముందు ఒప్పుకోకూడదు అనుకున్నాను కానీ అమ్మ ఒప్పించింది. షూటింగ్ కి వెళ్లాను. ఫస్ట్ టేక్ లోనే షాట్ ఓకే చేశారు. రెండు పేజీల డైలాగ్ చాలా బాగా వచ్చింది. సెట్‌లో ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు. వెంటనే సుందరం మాస్టర్ నా దగ్గరకు వచ్చి .. 'సారీ అమ్మా ఆరోజు తప్పు చేశాను` అన్నారని తెలిపారు సుధ.