English | Telugu
అర్జున్ కన్నింగ్ గేమ్.. అమర్ బొక్కలో ఆట!
Updated : Oct 26, 2023
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పరంపర సాగుతుంది. ఇందులో ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. అసలు గ్రూప్ గా ఆడమని చెప్పిన టేస్టీ తేజ.. శోభాశెట్టి, ప్రియాంక జైన్ తో కలిసి శివాజీ, యావర్, బోలే, ప్రశాంత్ లకి నామినేషన్ వేయాలని మాట్లాడుకున్నారు. ఇది కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు లైవ్ లో చూసి ఇన్ స్టాగ్రామ్ లలో గత రెండు రోజులుగా షేర్ చేస్తున్నారు. అయితే ఒకవైపు టాస్క్ లు అన్ ఫెయిర్ ఆడుతూ మళ్ళీ మళ్ళీ ఫౌల్స్ చేస్తున్నాడు అమర్ దీప్. మరొకవైపు శివాజీని బయటకి పంపించాలని అంబటి అర్జున్ పదే పదే ప్రయత్నిస్తున్నాడు.
అమర్ దీప్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు. ప్రతీసారీ ఆడతాను అని అనడం తప్ప ఆడింది లేదు గెలిచింది లేదు. నిన్న జరిగిన టాస్క్ లో ఏది మునుగుతుందో(సింక్)? ఏది తేలుతుందో(ఫ్లోట్) కూడా తెలియకుండా తనని తాను నమ్ముకోకుండా ప్రియాంక, శోభాశెట్టిలతో కలిసి ఫౌల్ గేమ్ ఆడాడు.
మొదట చాక్లెట్ మునుగుతుందో లేదో అంటే మునగదని పెట్టిన అమర్, ఆ కవర్ తీసాక కూడా మునగదని పెట్టాడు దాంతో చివరి స్థానంకి వెళ్ళాడు. ఇక బజర్ మోగి రౌండ్ ముగిసే సమయానికి అమర్ దీప్, టేస్టీ తేజ మధ్య టై అయింది. ఇక ప్రియాంక జైన్, శోభాశెట్టి కలిసి అమర్ దీప్ దగ్గరికి వెళ్ళి మేం క్లూ ఇస్తాం అది చూసి ఆన్సర్ చెప్పమని చెప్తారు.
ఒకవేళ మునిగితే(సింక్) నేను గోర్లు కొరుక్కుంటాను లేదంటే(ఫ్లోట్ అయితే) జుట్టు ఇలా అనుకుంటానని ప్రియంక జైన్ చెప్తుంది. ఇక ఇది ఫాలో అయిన అమర్ దీప్ పల్లి మునగదు అని పెడతాడు. ఆ పల్లీ మునగదని అమర్‌దీప్, మునుగుతుందని టేస్టీ తేజ పెడతాడు. దాంతో టేస్టీ తేజ గెలుస్తాడు. అమర్ దీప్ మొదటి కంటెండర్ టాస్క్ నుండి అవుట్ అవుతాడు. ఇంతమంది గ్రూప్ గా ఆడినా అమర్ దీప్ గెలవలేకపోయాడు. ఇది బొక్కలో గేమ్ అంటే అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసిపోతుంది.
అంబటి అర్జున్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. బయట నుండి చూసి వచ్చి.. తనకన్నా స్ట్రాంగ్ శివాజీ అని భావించి అతడిని ఎలాగైనా ఫౌల్ అని చేపించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సింక్ అండ్ ఫ్లోట్ లో టేస్టీ తేజకి శివాజీ ఆన్సర్ చెప్పాడని సంచాలకుడిగా ఉన్న గౌతమ్ కి చెప్తాడు. దాంతో గౌతమ్ కాసేపు రిజల్ట్స్ చెప్పకుండా క్లారిటీ తీసుకుంటాడు. కాసేపటికి.. "మీరు నాకు ఆన్సర్ చెప్పారని గౌతమ్ తో అర్జున్ చెప్పాడంట" అని శివాజీతో అంటాడు.
అలా అన్నావా అర్జున్ అని శివాజీ అడుగుతాడు. అదేం లేదు అన్న, డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకో అని చెప్పాను అని మాట మార్చేశాడు అంబటి అర్జున్. ఇది అసలు అన్ ఫెయర్ ఎలిగేషన్ అని శివాజీని ఎలాగైనా బ్యాడ్ చేయాలని అంబటి అర్జున్ తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ, మరొకవైపు శివాజీతో మంచిగ ఉన్నట్టు నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ఈ రోజుతో తెలిసిపోయింది.