English | Telugu
పల్లవి ప్రశాంత్ వన్ మ్యాన్ షో.. రికార్డు సృష్టించిన రైతుబిడ్డ!
Updated : Oct 26, 2023
బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. సోమవారం నామినేషన్ల హీట్ చల్లారిందనేలోపే టాస్క్ లతో మళ్ళీ నిప్పంటించాడు బిగ్ బాస్.
అయితే ఎప్పుడు రెండు టీమ్ లుగా విభజించి, టాస్క్ లు ఇచ్చే బిగ్ బాస్. ఇప్పుడు ఎవరి గేమ్ ఆడాలని, ఇలా ఎవరిలో ఎంత ట్యాలెంట్ ఉందో తెలియాలంటూ టాస్క్ లు ఇస్తున్నాడు. ఇందులో పల్లవి ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. అదేంటంటే నిన్న జరిగిన సెకండ్ టాస్క్ లో.. జిగ్ జాగ్ గా ఉన్న రూబిక్ క్యూబ్స్ ని ఒకే వరసులో ,ఒకే కలర్ క్యూబ్ ఉండేలా చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే ఈ టాస్క్ లో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతిక పాల్గొన్నారు. ఇక ఈ టాస్క్ కి సంచాలకుడిగా అంబటి అర్జున్ ఉన్నాడు. ఇక బజర్ సౌండ్ తో స్టార్ట్ మొదలైంది. టాస్క్ మొదలైన 25 సెకండ్లలో క్యూబ్స్ అన్నింటిని జతచేస్తూ, సరిచేస్తూ ఒకే వరుసలో ఒకే కలర్ క్యూబ్ లు వచ్చేలా చేసాడు. ఆ తర్వాత స్థానంలో యావర్ ఉన్నాడు. అయితే ఇంత తక్కువ సమయంలో చేయడం ఒక్క ప్రశాంత్ వల్లే అవుతుందని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ ఆడిన టాస్క్ లలో ఒక్కటంటే ఒక్క గేమ్ మాత్రమే ఓడిపోయాడు. అది కూడా సెకండ్ల తేడాలో ఓడిపోయాడు. 95% విన్నింగ్ పర్సంటేజ్ తో ఉన్న పల్లవి ప్రశాంత్ టాప్-5 లో నిలుస్తాడని అన్ని ఓటింగ్ పోల్స్ లో తేలింది. హౌస్ లో పల్లవి ప్రశాంత్ హవా కొనసాగుతుందనే చెప్పాలి ఎందుకంటే నిన్న నామినేషన్లో అమర్ దీప్ కప్పు పట్టుకునే పోతానని పల్లవి ప్రశాంత్ కి సవాల్ విసిరి, ఫస్ట్ టాస్క్ లోనే ఓడిపోయాడు. అదే పల్లవి ప్రశాంత్ గెలిచి టాప్ లో ఉన్నాడు.