English | Telugu

రేవంత్ అందరినీ తక్కువ చేసి మాట్లాడతాడు.. అందుకే అతనంటే కోపం!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక బీబీ కేఫ్ లో అర్జున్ బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు జనాల ప్రేమ, అభిమానాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పావ్.. కానీ వచ్చేటప్పుడు శ్రీసత్య కోసమే వెళ్లానని చెప్పావ్.. ఎందుకిలా" అని యాంకర్ అడిగేసరికి " మెయిన్ రీజన్ ఐతే అదే" అని ఆన్సర్ ఇచ్చాడు. "అంటే నువ్వు జనాల్ని మోసం చేసావు అనేగా అర్ధం" అన్నాడు యాంకర్.

ఇక నీకు, శ్రీసత్యకు మధ్య అన్న చెల్లెళ్ళ బంధం ఆపాదిస్తున్నాడని రేవంత్ మీద కక్ష పెంచుకున్నావ్ ..ఎందుకు అంత కోపం" అని అడిగేసరికి " ఎప్పుడూ అందరినీ తక్కువ చేయడానికి చూస్తాడు. ఏది చేసైనా గేమ్ గెలిచేయాలి అనుకుంటాడు. నన్ను కూడా చాలా సార్లు చాలా తక్కువగా చేసి మాట్లాడాడు" అన్నాడు అర్జున్.

ఇక దీపావళి పండగ సందర్భంగా క్రాకర్స్ పేర్లు చెప్పి అవి ఏ హౌస్ మేట్ కి సూటవుతుందో అడిగాడు ..."హౌస్ లో భూచక్రం అంటే ఇనయా. డిస్కషన్ స్టార్ట్ చేస్తే భూచక్రంలా అలా తిరుగుతూనే ఉంటుంది. చిచ్చుబుడ్డి సూర్యకి సూటవుతుంది. వెంటనే కోపం వస్తుంది...అంతలోనే తగ్గిపోతుంది. రాకెట్ ని శ్రీహాన్ కి ఇవ్వొచ్చు..దూసుకెళ్ళిపోతున్నాడు..బాగా ఆడతాడు. 1000 వాలాను పాజిటివ్ గా ఐతే శ్రీసత్యకి ఇవ్వొచ్చు. నెగటివ్ గా ఐతే రేవంత్ కి ఇవ్వొచ్చు " అని చెప్పాడు అర్జున్.