English | Telugu

అఖిల్ కాపురంలో చిచ్చు పెట్టిన హైపర్ ఆది!

ఢీ 14 ఇక దీపావళికి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. "ఈరోజు నేను, అఖిల్ ఒక ఇద్దరికి ప్రపోజ్ చేయబోతున్నాం" అని హైపర్ ఆది ఒక డైలాగ్ వేసాడు. "అఖిల్ ఒక పర్సన్ కి ప్రొపోజ్ చేస్తే ఓకే కానీ, ఎప్ప్పుడూ ఒక్కో రోజు ఒక్కో పర్సన్ ఐతే కష్టం కదా" అంది పూర్ణ. "మేమైతే షూటింగ్ టైములో మాట్లాడుకుని వెళ్ళిపోతాం కానీ అఖిల్ నువ్వు మాత్రం షూటింగ్ ఐపోయాక కూడా కలుస్తున్నావ్ అంటా" అని ప్రదీప్ కూడా అఖిల్ ని కార్నర్ చేసేసరికి "ఎవరిని కలిసాను అన్నా" అన్నాడు అఖిల్.. "శ్రద్ధా దాస్ గారిని కలిసావా లేదా బయట" అని ప్రదీప్ వేసిన ఈ డైలాగ్ కి అందరూ నవ్వేశారు.

తర్వాత ఆది అఖిల్ కార్ డ్రైవర్ గా ఒక సీన్ రీ-క్రియేట్ చేసి చూపించి మంచి ఫన్ చేశారు. ప్రదీప్ శ్రద్ధాదాస్ లా చేసాడు. ఇక అఖిల్ శ్రద్ధాతో చేసిన ఓవర్ యాక్షన్ కి ఆది మధ్యలో వచ్చి "మీరు ఈ అమ్మగారి దగ్గర ఉంటే ఆ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు" అని చెప్పేసరికి "ఆ అమ్మగారికి ఈ అమ్మగారికి పడదు. షూటింగ్ లో ఉన్నానని ఏదో చెప్పేసి ఫోన్ పెట్టేయ్" అన్నాడు అఖిల్. ఇక ఆది ఇదే టైం అనుకుని ఆ అమ్మగారికి ఫోన్ చేసి "సర్ షాట్ లో ఉన్నాడు.. కాదు కాదు షూట్ లో" ఉన్నాడు అంటూ అఖిల్ కాపురంలో చిచ్చు పెట్టేసాడు. ఇక కంటెస్టెంట్స్ క్వార్టర్ ఫైనల్స్ సందర్భంగా చేసిన డ్యాన్సులు అద్దిరిపోయాయి. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.